Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు

న్యూస్ తెలుగు /వినుకొండ : దివంగత ముఖ్యమంత్రి, ప్రజల నాయకుడు డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు వినుకొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ జయంతిని పురస్కరించుకొని, వినుకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బోయపాటి రామాంజనేయులు ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోయపాటి రామాంజనేయులు మాట్లాడుతూ. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవలం ఒక నాయకుడు కాదని, “కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని రామాంజనేయులు ఉద్ఘాటించారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చాయని గుర్తు చేశారు. ముఖ్యంగా, “ఆరోగ్యశ్రీ నుండి ఇంటి పధకం వరకు” ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన సంక్షేమ యోధుడు వైఎస్సార్ అని కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సేవ మార్గాన్ని గుర్తు చేసుకోవడం తమ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!