ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కుటమీ ప్రభుత్వం
న్యూస్‌తెలుగు/సాలూరు : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కుటమీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు( చిన్న శ్రీను) అన్నారు సోమవారం సాలూరు పట్టణంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం సాలూరు మెంటాడి వీధిలో ఉన్న శ్రీ కోదండరామ కళ్యాణ మండపంలో సాలూరు నియోజకవర్గ వైయస్సార్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ,మాజీ గిరిజన శాఖ మాత్యులు వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ కుటమీ ప్రభుత్వం సుపరిపాలన మొదటి అడుగు అనే కార్యక్రమం చేస్తున్నారని, ప్రజలకి ఇచ్చిన హామీలు ఇవ్వకుండా మోసం చేస్తున్నందుకా ఈ కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గుర్తుకు చేస్తూ ఇంటింటికి వంచన బాబు షూరిటీ అబద్ధాలు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి వీరు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పి పథకం కూడా అమలు చేయలేదని అన్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గం లో ఉన్న ప్రజలకు అనేక రకాలైన హామీలిచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అన్నారు. గిరిజన గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా చేస్తామని చిప్పి ఇప్పుడు వరకు అమలు చేయలేదని అన్నారు. జీవో నెంబర్ 3 ను అమలు చేస్తామని అన్నారు గానీ ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ఈ జీవోకు ప్రత్యామ్నాయంగా వేరే జీవో తెస్తామనం గిరిజనలను మోసగించడమే అని అన్నారు. గిరిజనులకు స్పెషల్ డిఎస్సీ ఇస్తామని చెప్పి డీఎస్సీ కూడా ఇవ్వకుండా మోసం చేసిన అన్నారు. సాలూరులో ఆటోనగర్ కి నిధులు మంజూరు చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయలేదని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనె మక్కువ రోడ్డు నిర్మిస్తామని చెప్పి ఇప్పటివరకు అతిగతి లేదని అన్నారు. మంత్రిగా ప్రమాణం చేసిన మొదటి రోజు ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎంలో నియమిస్తామని సంతకం చేసి ఇప్పటివరకు నియమించకుండా మోసం చేశారని అన్నారు.. అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యూట్ ఫ్యాక్టరీ తేరిపిస్తామని చెప్పి ఇప్పటివరకు తెరిపించకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో డోలీలు లేకుండా అరికడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన గ్రామాల్లో డోలి మోతలు ఎక్కువైనన్ని అన్నారు. మెట్టవలస గ్రామంలో నేను అధికారంలో ఉండేటప్పుడు ఆ పాఠశాలకు నిధులు మంజూరు చేశానని అధికారంలోకి వచ్చిన వెంటనే సంధ్యారాణి ఆ పాఠశాల నిర్మిస్తామని చెప్పి నిర్మించలేదని అన్నారు. నియోజకవర్గంలో రాష్ట్రంలో మహిళలపై, చిన్న పిల్లలపై అత్యాచారాలు జరిగిన కనీసం పట్టించుకోకుండా వారికి రక్షణ కరువైందినన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సాలూరు నియోజకవర్గం లో ఉన్న ప్రతి గ్రామానికి తాగునీరు ఇస్తామని చెప్పి ఒక్క గ్రామానికైనా త్రాగునీరు మంజూరు చేశారా అన్నారు. ఎన్నికల్లో మోసపూరితమైన హామీలు అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా దాచుకోవడం దోచుకోవడం కూటమి నాయకులు చేస్తున్నారని అన్నారు. అరుకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మ తనుజా రాణి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఒకటో రెండో ఇస్తూ ఇచ్చిన పథకాలు కూడా నిబంధనలు ఉన్నాయని చెప్పి తగ్గించడం జరుగుతుందని అన్నారు. గిరిజన శాఖ మంత్రిగా ఉన్న సంధ్యారాణి మినిమం నాలెడ్జి లేకుండా మాట్లాడుతున్నారని ఆమె గిరిజన సమస్యల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని అన్నారు. కుటమీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ (చిన్న శ్రీను) మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల్లో అబద్ధపు హామీలిచ్చిన నాయకులను ప్రజలు నిలదీయాలని అన్నారు. సూపర్ సిక్స్ పథకాల బాధ్యత కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్న వారి మాటకి విలువలేదని వారిచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలోనికి పనికిరాడను ఆయన సినిమాల్లో పనికొస్తాడని అన్నారు. ఆయన పరిపాలన నాకు చేతకాదే అని అనడం ఆయన మంత్రి పదవికి అనార్హుడని అన్నారు. పిఎస్ 4 అనే విధానం చంద్రబాబు తెచ్చారని వీటిలో ధనవంతులు పేదవారిని దత్త తీసుకోవడమని అలా ఉమ్మడి జిల్లాలో కోటీశ్వరులు చాలామంది ఉన్న పేద కుటుంబాలను ఒక్కరు కూడా దత్తత తీసుకోలేదని అలాంటిది మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు 260 మందిని మంత్రి సంధ్యారాణి 10 మందిని దత్తత తీసుకుంటున్నాడంటే ఈ ఇద్దరూ ఎంత డబ్బు దోసుకుంటున్నారో ప్రజలు తెలుసుకోవాలని అన్నారు కుటమి ప్రభుత్వం నాయకులు దాచుకోవడం దోచుకోవడం తప్ప ప్రజలకు ఒక్క పనికొచ్చిన కార్యక్రమమైనా చేశారా అని అన్నారు. ఇలాంటి నాయకులను ప్రజా కోర్టులో నిలదీసి రానున్న స్థానిక ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ప్రతి ఒక్క వైయస్సార్ కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి కూటమి ప్రభుత్వం చంద్రబాబునాయుడు మోస ఊరికి మేన హామీలను ప్రజలకు వివరించాలన్నారు. ,అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ…ఎన్నికల్లో మీరంతా గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించి మోసంతో గెలిచారు.గెలిచాక మీరిచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత మీపై ఉంది.మిమ్మల్ని నిలదీసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది_…మా నాయకుడు వైఎస్ జగన్* ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల తరఫున మేము పోరాడతాం,మిమ్మల్ని ప్రశ్నిస్తాం.మీరిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రజల్లోనికి వెళతాం_అధికారం చేపట్టి ఏడాది గడిచినా హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు తెర లేపారు,హామీలపై నిలదీసిన వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేము ప్రతిపక్షంగా ప్రజల తరఫున ,ప్రజల గొంతుకను వినిపిస్తూనే ఉంటాం అని అన్నారు, ఆనాడు ఎన్నికల ప్రచారంలో ఏదైతే చెప్పారో అన్నదాతలకు ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభవ భరోసా,ఇప్పటికే ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది, కానీ ఏప్రిల్ మే నెలల్లో వేస్తానన్నా అన్నదాత సుఖీభవ భరోసా ఇప్పటికీ వేయలేదు, అన్నదాతలు యొక్క సమస్యలు ఈ కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు వైయస్సార్ పార్టీ పార్వతిపురం జిల్లా అధ్యక్షులు శత్రు చర్ల పరీక్షిత్ రాజ్ మాట్లాడుతూ . జగనన్న పాలనలోనే ప్రజా సంక్షేమ పాలన జరిగిందని ఓటమి ప్రభుత్వం జగనన్న ఇచ్చిన పథకాలన్నీ ఎగ్గొట్టి ప్రజలను మోసం చేసిందని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా డైవర్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైయస్సార్ పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారని ఏ ఒక కార్యకర్త కూడా భయపడవలసిన అవసరం లేదని మీకోసం వేదిక మీద ఉన్న నాయకులందరము మీకు ఎటువంటి సమస్య వచ్చినా మీకు అండగా వైయస్సార్ పార్టీ మేము ఉంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైస్సార్సీపీ పార్టీ ముఖ్య నాయకులు,మండలం పార్టీ అధ్యక్షులు,అనుబంధ విభాగాల అధ్యక్షులు,మున్సిపల్ చైర్మన్ పువ్వుల ఈశ్వరమ్మ పాచిపెంట ఎంపీపీ బద్నాన ప్రమీల,మున్సిపల్ కౌన్సిలర్లు సాలూరు, మెంటాడ, మక్కువ పాచిపెంట మండలాల ఎంపీపీలు,జడ్పీటీసీలు,ఎంపీటీసీలు,సర్పంచులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story:ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కుటమీ ప్రభుత్వం)

