బొల్లా నీచ రాజకీయాలు మానుకోవాలి..
శావల్యాపురం టిడిపి నాయకుల హెచ్చరిక
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం మండలం, వేల్పూరు గ్రామానికి చెందిన ఉయ్యాల తిరుపతిరావు మృతి పట్ల వాస్తవాలు తెలుసుకోకుండా కూటమి ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేయటం బొల్లా బ్రహ్మనాయుడు నీచ రాజకీయాలకు నిదర్శనమని శావల్యాపురం మండల టిడిపి నాయకులు…… తీవ్రంగా ఖండించారు. చీఫ్ విప్ కార్యాలయంలో సోమవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సొంత గ్రామం వేల్పూర్ లో ఏమి జరుగుతుందో తెలుసుకోకుండా మాట్లాడటం సిగ్గుచేటు అన్నాడు. తిరుపతిరావుకు మూడు సంవత్సరాల క్రితం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన స్వాతీతో వివాహం జరిగి వారి మధ్య విభేదాలతో రెండేళ్లుగా భార్య పుట్టింటి వద్ద ఉండటం, ఈ క్రమంలో మనస్పర్ధలకు గురైన తిరుపతిరావు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడు తల్లిదండ్రులు రామాంజనేయులు, సామ్రాజ్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా షిఫ్ట్ ఆపరేటర్ గా తొలగించారని, టిడిపి నాయకుల ఒత్తిళ్లు, కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలు చేయటం సిగ్గుచేటు అన్నారు. ఆ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేసినట్టు బ్రహ్మనాయుడు కూడా వినుకొండలో శవ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం, టిడిపి నాయకులపై అసత్య ఆరోపణలు, విమర్శలు చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యరమాసు కోటేశ్వరరావు, గుంటూరు సాంబశివరావు, గోరంట్ల హనుమంతరావు, బొల్లా పేరయ్య, గడిపూడి విశ్వనాథం, గద్దె వీర మస్తాన్రావు పాల్గొన్నారు. (Story:బొల్లా నీచ రాజకీయాలు మానుకోవాలి..)