రాష్ట్రంలో మారుతున్న పేద, బలహీనవర్గాల జీవితాలు
ఏడాది కూటమి పాలనలో ప్రతి ఇంటికీ పథకాల ఫలాలు
వినుకొండలో పింఛన్ల పంపిణీలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ, డీసీసీబీ ఛైర్మన్ మక్కెన
న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినదగ్గర్నుంచి పేద, బలహీనవర్గాల జీవితాల్లో కొత్తవెలుగులు వస్తున్నాయని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గడిచిన ఏడాదిలో ఒక్క పింఛన్లకే రూ.34వేల కోట్లు వ్యయం చేశారని, అన్నిరకాల సంక్షేమపథకాలకు రూ.లక్ష కోట్లకు పైగా వెచ్చించిన ఘనత కూట మి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుది అన్నారు. ఫలితంగానే ప్రభుత్వం,.. పథకాల సాయంతో ప్రజల జీవితాల్లో కొత్త మార్పును చూస్తున్నామన్నారు. వినుకొండ 3వ వార్డు ఇందిరా నగర్ లో మంగళవారం నిర్వహించిన సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందించారు. భగవంతుని సృష్టిలో భంగపడి అంగవైకల్యంతో జీవనం సాగిస్తున్న వేలాదిమందికి ఎన్టీఆర్ భరోసా కింద 6000 చొప్పున పెన్షన్లు పంపిణీ చేయడం జరుగు తున్నదని చీఫ్ విప్ ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ట. శ్రీనివాస్ అనే అంగవైకల్యంతో ఉన్న యువకుడ్ని ఓదార్చి ఫంక్షన్ పంపిణీ చేస్తూ ఇంటి స్థలం కూడా మంజూరు చేస్తామని ఈ సందర్భంగా జీవి భరోసా ఇచ్చారు. అలాగే కళ్ళు కనిపించని ఈశ్వరరావు అనే వ్యక్తికి పెన్షన్ పంపిణీ చేసి కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈశ్వర్ రావు తల్లికి వందనం కింద తన ఇంట్లో ఇద్దరు విద్యార్థులకు పథకం అందుతుందని జీవికి అతను వివరించాడు. అదేవిధంగా వారి సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు ప్రతి నెల 1వ తేదీ… సెలవు వస్తే ముందు రోజు ఇంటింటికీ ఠంఛనుగా పింఛను ఇవ్వడం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సామాజిక భద్రతా పింఛన్ ద్వారా వృద్ధులు, వితంతు వులు, వికలాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి అందుతున్న ఆర్థిక సహాయం వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగపడుతోందన్నారు. అందుక్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడటం తమ బాధ్యత అని ఉద్ఘాటించారు. ఇందులో భాగంగా ప్రతినెల లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వారి సమస్యలను తెలుసుకుని, వారికి అండగా నిలబడటం ద్వారా ఇది అందరి ప్రభుత్వం అనే సందేశాన్ని కూడా బలంగా ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దస్తగిరి షకీలా, పీవీ సురేష్ బాబు, పి అయూబ్ ఖాన్, మునిసిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, సానిటరీ అధికారి ఎస్కే ఇస్మాయిల్, ఖాజా తదితరులు పాల్గొన్నారు. (Story:రాష్ట్రంలో మారుతున్న పేద, బలహీనవర్గాల జీవితాలు)