జిల్లాలో టోపోనమి సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లాలో టోపోనమి సర్వే పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరమంలో సర్వే ఆఫ్ ఇండియా నోడల్ అధికారి సురేష్ కుమార్ జిల్లాలోని మండల పరిషత్ స్టాటిస్టిక్స్ అధికారులు, సర్వేయర్లకు నోడల్ అధికారి టోపోనమి ఏ విధంగా చేయాలి, మండలంలోని పేర్లు, రెవెన్యూ గ్రామాల పేర్లు పలికేటప్పుడు ఏ విధంగా పలకాలి అనేది సర్వే ఆఫ్ ఇండియా ద్వారా టోపోనమి సర్వే నిర్వహించడం జరుగుతుంది. సర్వేలో భాగంగా నిర్ణిత ప్రొఫార్మలో పూరించాల్సిన అంశాలు ఏంటి అనే విషయాలను నోడల్ అధికారి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సర్వే చేయడం, ప్రొఫార్మలో పూరించాల్సిన అంశాల పై ఏ చిన్న అనుమానం ఉన్న నోడల్ అధికారి వద్ద నివృత్తి చేసుకోవాలని అనంతరం టోపోగ్రఫీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సర్వే ఆఫ్ ఇండియా ద్వారా చేపడుతున్న టోపోగ్రఫీ వనపర్తి జిల్లాకు సంబంధించిన నైసర్గిక స్వరూపం ఖచ్చితత్వంతో నమోదు జరిగేవిధంగా చూడాల్సిన బాధ్యత ఉందని తెలియజేశారు. జిల్లా ప్రణాళిక సంఘం అధికారి భూపాల్ రెడ్డి, సర్వే ఆఫ్ ఇండియా నోడల్ అధికారి సురేష్ కుమార్, ఎ.డి సర్వే ల్యాండ్ రికార్డ్స్ బాలకృష్ణ, యం.ఎస్. ఒ లు, సర్వేయర్ లు పాల్గొన్నారు. (Story:జిల్లాలో టోపోనమి సర్వే పకడ్బందీగా నిర్వహించాలి)