Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్లపై అధికారులతో జీవి సమీక్ష

శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్లపై అధికారులతో జీవి సమీక్ష

శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్లపై అధికారులతో జీవి సమీక్ష

భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలి

అధికారులు సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలి

కొండపైకి ఆర్టీసీ బస్సు సౌకర్యం

30 వేల మందికి అన్నదానం

న్యూస్ తెలుగు / వినుకొండ : జులై-6 తేదీన వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్ల తొలి ఏకాదశి పండుగను అత్యంత వైభవంగా జరిపేందుకు అధికారులు సమిష్టిగా పనిచేసే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశించారు. తొలి ఏకాదశి కొండ తిరునాళ్ల సందర్భంగా శనివారం మునిసిపల్ సమావేశ మందిరంలో నరసరావుపేట ఆర్డీవో మధులత అధ్యక్షతన అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి అత్యంత చారిత్రాత్మక చరిత్ర కలిగి ఉందని, స్వామివారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకునేందుకు వేలాదిగా తరలివస్తారని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, అందుకు అధికారులు బాధ్యతగా సమిష్టి కృషితో సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. పట్టణంలోని దేవాలయాలు, కొండ వద్ద, పట్టణంలోని పరిచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెట్ల మార్గంలో వెళ్ళు భక్తులతో పాటు, మెయిన్ బజార్ నుండి చిన్న కొండపైకి వెళ్లే భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే భక్తులకు మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ను ఆదేశించారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో పూజా సామాగ్రి అధిక రేట్లకు విక్రయించకుండా, భక్తులు క్యూ సిస్టంలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించే విధంగా దేవాదాయ శాఖ అధికారులు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఘాట్ రోడ్డులో మరమ్మత్తు పనులు వెంటనే చేయాలని పి ఆర్, ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. తిరునాళ్ల రోజు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తొలి ఏకాదశి తిరునాళ్ల రోజు స్వామివారిని దర్శించుకునేందుకు 35 కు పైగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. అవసరమైన చోట కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ తదితర స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి భక్తులకు త్రాగునీరు, అన్నదాన ప్రసాదాలు, సౌకర్యాలు కల్పిస్తూ సేవలు అందించడం అభినందనీయమన్నారు. 30 వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. నరసరావుపేట ఆర్డీవో మధులత మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులందరూ సమన్వయంతో వినుకొండ రామలింగేశ్వర స్వామి తొలి ఏకాదశి తిరుణాలను విజయవంతం చేసే విధంగా పనిచేయాలని కోరారు. సమీక్షా సమావేశంలో జిడిసిసి చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, మునిసిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, తాసిల్దార్ సురేష్, ఎండోమెంట్ జిల్లా అధికారి శ్రీనివాసులు, ఎండోమెంట్ ఈవో సుధాకర్ రెడ్డి , ఆలయ కమిటీ అధ్యక్షులు, వినుకొండ నియోజకవర్గం లోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (Story:శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్లపై అధికారులతో జీవి సమీక్ష)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!