Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఎమ్మెల్యే చోరవతో విద్యుత్ సమస్య పరిష్కారం

ఎమ్మెల్యే చోరవతో విద్యుత్ సమస్య పరిష్కారం

ఎమ్మెల్యే చోరవతో విద్యుత్ సమస్య పరిష్కారం

న్యూస్‌తెలుగు/చింతూరు / రంపచోడవరం : ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి భాస్కర్ కు ఎటపాక మండలం లక్ష్మీపురం పంచాయతీలోని పట్టుచీర గ్రామస్తులు తమ గ్రామానికి లో వోల్టేజ్ సమస్య ఉందని ప్రజాదర్బార్ లో దరఖాస్తు చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.టీవీలు ఫ్రిజ్లు కూలర్లు మిక్సీలు లో వోల్టేజ్ కారణంగా కాలిపోతున్నాయి ఈ సమస్యను పరిష్కరించాలని లక్ష్మీపురం పంచాయతీ తెలుగుదేశం పార్టీ కమిటీకి తెలియజేశారు. లక్ష్మీపురం కమిటీ ద్వారా ఎమ్మెల్యే మిర్యాల శిరీష భాస్కర్ ప్రజా దర్బార్ వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికలో ఒక్క అర్జీ ఎమ్మెల్యే కు సమర్పించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే ప్రత్యేక నిధుల నుంచి సుమారు నాలుగు లక్షల రూపాయలు కలిగిన ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలు మంజూరు చేయించారు. ఎన్నో ఏళ్ల సమస్యకి పరిష్కారం చూపించారు. శనివారం నూతన ట్రాన్స్ఫార్మర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష భాస్కర్ ఫోటోలకు గ్రామస్తులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. మునుముందు ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం ఇంకా సేవలు అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు కనితి మధు, అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం భాగంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పుట్టి రమేష్ బాబు, ఐటీడీపీ ఛాంపియన్. బాచినేని శ్రీకాంత్, ఉండేటి.రమేష్, మాజీ సర్పంచ్ పెనుబల్లి సీతయ్య, జనసేన మండల ఉపాధ్యక్షులు మొల సతీష్, వాసంశెట్టి రామకృష్ణ, బాదావత్ స్వామి, శ్రీను, పి సత్యం, తులసి,నాగమణి. విద్యుత్ సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (sTORY:ఎమ్మెల్యే చోరవతో విద్యుత్ సమస్య పరిష్కారం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!