Homeవార్తలుతెలంగాణకేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి, కాల్పుల విరమణ ప్రకటించాల

కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి, కాల్పుల విరమణ ప్రకటించాల

కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి, కాల్పుల విరమణ ప్రకటించాల

ఆదివాసి మహిళలపై అత్యాచారాలు నిలిపివేయాలి పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలి
ఎన్కౌంటర్లపై న్యాయవిచరణ జరిపించాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యాలయం భగత్ సింగ్ నగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్తో నిర్వహించబడింది ఈ సమావేశానికి ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ రాష్ట్ర కన్వీనర్ ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు తాను మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బేషజాలకు పోకుండా కాల్పుల విరమణ ప్రకటించి ఆపరేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు బిజెపి దేశంలో ప్రజాస్వామ్యానికి నిరంకుషానికి పోటీ పెట్టి జూదం ఆడుతుందని దుయ్య బట్టాడు బిజెపి పాలనలో మానవత్వం తీవ్ర సంక్షేపంలో పడిపోయిందని అంతర్జాతీయంగా మన ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు దేశంలోని సమస్యల నుండి దృష్టి మరల్చాదానికి ఆపరేషన్ కగారును ప్రారంభించారని దేశ పౌరుల మీద యుద్ధం ప్రకటించడం అన్యాయం చట్ట వ్యతిరేకం అన్నారు బిజెపి పాలనలో ప్రజలు తీవ్రమైన సమస్యలు నిరుద్యోగం నిరక్షరాస్యత ఆకలి వివక్ష ఎదుర్కొంటున్నారు అన్ని రంగాల్లో విఫలమయ్యారు ఈ సమావేశంలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మాట్లాడుతూ సాయుధ పోరాటం తెలంగాణ స్వభావంలోనే ఒక భాగం అని విరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిపిన చరిత్ర ఉన్నది సాయుధ పోరు ఈనాటిది కాదనీ అన్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ఉద్యమించాలన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు TPTF నుండి వెంకట్ నారాయణ మాట్లాడుతూ ఉద్యమకార్తికారులు నిస్వార్థపరులు అని ప్రజల విముక్తి పోరాటాలు చేశారని అటువంటి వారిని కాల్చి చంపడం అన్యాయం అన్నారు ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రామన్ కుమార్ మాట్లాడుతూ పౌర సమాజం మేధావులు చర్చలు జరపాలని ఒత్తిడి తెస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎన్కౌంటర్లతో సమాధానం చెబుతుందని దుయ్యబట్టారు చివరికి శవాలను కూడా కుటుంబీకులకు అప్పజెప్పకుండా అమానవీయతను కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించింది సిఎల్సి ఉమ్మడి జిల్లా నాయకులు జక్కా బాలయ్య మాట్లాడుతూ దండకారణ్యంలో అడుగడుగునా పోలీస్ క్యాంపులు వెలిశాయని ఆదివాసి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి అని తెలిపారు.ఈ సమావేశానికి జక్కుల వెంకటయ్య అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో కవి జనజ్వాల, డిటిఎఫ్ రాష్ట్ర నాయకులు ఏసుబు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, శ్రీనివాస్ గౌడ్, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్లు, జిల్లా జేఏసీ నుండి వేణుగోపాల్, గంధం నాగరాజు, చైతన్య మహిళా సంఘం నుండి అనిత, శ్రీనివాసులు సిపిఐ టౌన్ కార్యదర్శి రమేష్, సిపిఐ నాయకులు గోపాలకృష్ణ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ మన్నెంకొండ, జిల్లా కార్యదర్శి సుధాకర్, కేఎన్పి ఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, వెంకటేష్ తదితరులు మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు పాల్గొనీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేశారు.(Story : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి, కాల్పుల విరమణ ప్రకటించాల )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!