జెకె సిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్సింగ పేట గ్రామంలో మంచినీటి బోరు
న్యూస్ తెలుగు/చింతూరు : మండలంలోని ముకునూరు గ్రామపంచాయతీ పరిధిలో నర్సింగ పేట గ్రామంలో జెకె సీటి ట్రస్ట్ చైర్మన్ ఆయుర్వేద వైద్యులు మహమ్మద్ జమాల్ ఖాన్ త్రాగునీటి బోరును ఏర్పాటు చేసి శనివారం ప్రారంభించారు. వేసవికాలం త్రాగునీటి సమస్యతో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్న క్రమంలో ఈ విషయాన్ని జెకె సిటీ చైర్మన్ జమాల్ ఖాన్ కు తమ గ్రామంలో తాగునీటి బోరు ఏర్పాటు చేయాలని విన్నవించారు. దానికి స్పందిస్తూ జమాల్ ఖాన్ వెంటనే రిగ్గును తెప్పించి డ్రిల్లింగ్ చేయించి అనంతరం బోర్ హ్యాండిల్ ను ఏర్పాటు చేశారు. అడిగిన వెంటనే తమ త్రాగునీటి సమస్యను పరిష్కరించిన జమాల్ ఖాన్ను గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సన్నాసిరావు, ఉప సర్పంచ్ దుర్గ, మాజీ టిడిపి మండల అధ్యక్షులు ఎండి జహంగీర్, మార్కెట్ కమిటీ సభ్యులు పి సాల్మన్ రాజు,గ్రామస్తులు రవ్వ భీమయ్య, బీరబోయిన సత్యనారాయణ, సోడే గంగయ్య పాల్గొన్నారు. (Story:జెకె సిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్సింగ పేట గ్రామంలో మంచినీటి బోరు)

