పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్
న్యూస్‌తెలుగు/హైదరాబాద్ సినిమా :టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్, ఆర్టిస్టులు 25 మందికి పైగా రామ్ కొనికి హెయిర్ స్టైలిస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. అతనికి పవన్ అంటే ప్రత్యేకమైన అభిమానం.
సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిస్ట్‌గా వ్యవహరించే రామ్ కొనికికి హైదరాబాద్, జూబ్లీ హిల్స్ ఏరియాలో ‘సెలూన్ కొనికి’ పేరుతో ఒక స్టూడియో ఉంది. ఇప్పుడు ఏపీలో, విజయవాడ ఎంజి రోడ్డులో మరొక స్టూడియో ఓపెన్ చేశారు. పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఆ స్టూడియో లాంచ్ ఆదివారం జరిగింది. హైదరాబాద్‌లో స్టూడియో లాంచ్ కూడా పవన్ చేతుల మీదుగా జరిగింది.
‘రామ్’ కొనికి పేరులో రాముడు ఉన్నాడు. కానీ, ఆయన పవన్ కల్యాణ్‌కు భక్తుడు అని, ఆయన వెంట ఎప్పుడూ కనిపించే హనుమంతుడు అని ఇండస్ట్రీలో దగ్గర నుంచి చూసే వ్యక్తులు చెప్పే మాట. ఇప్పుడు పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అని తన స్టూడియో ఓపెనింగ్‌కు పిలవలేదు. ఆయన అధికారంలోకి రాకముందు కూడా పవన్‌ను పిలిచారు. ఇప్పుడు కూడా పవన్ కల్యాణ్ కోసం వెయిట్ చేసి స్టూడియో లాంచ్ చేశారు. (Story: పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్)