Homeవార్తలుతెలంగాణ100 కేజీల గంజాయి పట్టివేత

100 కేజీల గంజాయి పట్టివేత

100 కేజీల గంజాయి పట్టివేత

న్యూస్ తెలుగు/చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం పోలీసులు 100 కేజీల గంజాయి ని శుక్రవారం సాయంత్రం పట్టుకున్నారు. ఈ గంజాయి కి సంబంధించిన వివరాలు సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయం లో అదనపు ఎస్పి పంకజ్ కుమార్ మీనా శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా లో గంజాయి నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్ ఆదేశాల మేరకు చింతూరు సర్కిల్ లోని మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. వాహనాల తనిఖి లు నిర్వహిస్తుండగా డొంకరాయి వైపు నుండి చింతూరు వైపు వస్తున్న టి యస్ 08 హెచ్ 0756 మారుతి స్విఫ్ట్ కారు తనిఖీ చేయగా గంజాయి కనుగొన్నామన్నారు . ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రంలోని మల్కనగిరి జిల్లా చింతూరు మండలంలోని తులుగొండ గ్రామానికి చెందిన కరణం రామాంజనేయులు, ఆరెలా బొజ్జి ఇద్దరు కలిసి కారులో తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. కారులో మొత్తం 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ ఐదు లక్షల రూపాయలు కాగా, బయట మార్కెట్లో ఎక్కువ ఉంటుంద న్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కోవాసి తాతారావు, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం కు చెందిన షేక్ సుభానిలపై కేసు నమోదు చేశామన్నారు. దొరికిన నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ నిందితులపై గతంలో కేసులు ఉన్నాయని అదనపు ఎస్పీ తెలిపారు.కొవ్వాసి తాతారావు పై డొంక రాయి, చింతూరు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు ఉన్నాయన్నారు. కరణం రామాంజనేయులపై చింతూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు, షేక్ సుభాని పై చింతూరు పోలీస్ స్టేషన్ లో ఒక గంజాయి కేసు గతంలోనే ఉందన్నారు. ఈ నలుగురు అక్రమ రవాణాకు గ్యాంగ్ గా పనిచేస్తున్నారన్నారు. గంజాయి రవాణా అడ్డుకునేందుకు డైనమిక్ వాహన తనిఖీలు అల్లూరు జిల్లాతో పాటు చింతూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా అడ్డుకునేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వాహన తనిఖీలు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి రవాణాకు సంబంధించి ఏ సమాచారం తమ వద్దవున్నా చింతూరు, మోతుగూడెం, డొంకరాయి ఎస్ఐ తనకు గాని సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు గంజాయి వాడకాన్ని పూర్తిగా నివారించండని, వాడకం, రవాణా, సాగు చేయటం, నిలువ ఉంచటం లాంటి పనులు చేస్తే ఎవరికైనా ఎన్ డి పి సి యాక్ట్ ప్రకారం కఠినమైన శిక్షలు విధించబడతాయన్నారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు ఉండవని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ తెల్లం దుర్గాప్రసాద్, మోతుగూడెం ఎస్ఐ షేక్ సాదిక్, చింతూరు ఎస్ఐ పేరూరి రమేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.(Story : 100 కేజీల గంజాయి పట్టివేత )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!