Homeవార్తలుతెలంగాణత్వరితగతిన ధాన్యం అన్‌లోడ్ చేయాలి

త్వరితగతిన ధాన్యం అన్‌లోడ్ చేయాలి

త్వరితగతిన ధాన్యం అన్‌లోడ్ చేయాలి

న్యూస్ తెలుగు/వనపర్తి : త్వరితగతిన ధాన్యం అన్‌లోడ్ చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు ఆదేశం శుక్రవారం పెబ్బేరు మండలంలోని సప్తగిరి, సాయి గోపాల్ రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు వస్తున్న ధాన్యాన్ని త్వరితగతిన అన్‌లోడ్ చేయాలని మిల్లు యజమానులను ఆదేశించారు. ధాన్యం అన్‌లోడ్‌లో జాప్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అదనపు కలెక్టర్ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందిస్తూ, “ఎక్కువ కోతలు (కటింగ్స్) లేకుండా, త్వరితగతిన ధాన్యాన్ని అన్‌లోడ్ చేయాలి. తరుగు పేరుతో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దు” అని ఆయన స్పష్టం చేశారు. రైతులు పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర అందించి, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత మిల్లు యజమానులపై ఉందని వెంకటేశ్వర్లు గారు అన్నారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆయన మిల్లు యజమానులకు సూచించారు.(Story  : త్వరితగతిన ధాన్యం అన్‌లోడ్ చేయాలి )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!