Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ అత్యాధునిక వసతులతో నీహల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

అత్యాధునిక వసతులతో నీహల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

0

అత్యాధునిక వసతులతో నీహల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం 

న్యూస్ తెలుగు/సాలూరు: ప్రజలకు అత్యవసర వైద్యం అందుబాటులోనికి అత్యాధునిక వసతులతో నీహల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ గిరిజన శాఖ మాత్యులు ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు పీడిక రాజన్న దొర అన్నారు శుక్ర వారం సాలూరు పట్టణంలో గల దాసరి వీధిలో ఉన్న నిహాల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. మొదట ఆయనకు ఈ హాస్పిటల్ యజమానులైన డాక్టర్ బంకురు అప్పలనాయుడు, డాక్టర్ టంకాయల ద్రాక్షాయిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాలూరు నియోజకవర్గంలో పాటు పక్కన ఉన్న నియోజకవర్గాలు, అదేవిధంగా ఒరిస్సా ఛత్తీస్గడ్, రాష్ట్రల ప్రజలకు, ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు, సామాన్యులకు వైద్యం అందుబాటులో ఉండాలంటే ఈ హాస్పిటల్ కి ఆరోగ్య సేవలు వచ్చేటట్లు కృషి చేయాలని అన్నారు. ఆరోగ్య సేవ వచ్చినట్లయితే సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా ఈ హాస్పిటల్ లో వైద్యం చేయించుకోవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు . అనంతరం డాక్టర్ దంపతులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాలూరు వైయస్సార్ పార్టీ అధ్యక్షులు వంగ పండు అప్పల నాయుడు. వైఎస్ఆర్ జిల్లా ప్రచార కార్యదర్శి గిరి రఘు. కౌన్సిలర్ గొర్లి వెంకటరమణ, సాలూరు మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు సువ్వాడ భరత్ శ్రీను వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్ , పద్మావతి దంపతులు , వైఎస్ఆర్ పార్టీ నాయకులు తాడ్డి యశోద కృష్ణ ,కర్రి అప్పల స్వామి పురోహితుని వలస సర్పంచ్ బంకురు తిరుపతి నాయుడు, పురోహితుని వలస మోడల్ స్కూల్ చైర్మన్ బంకురు శ్రీనివాసరావు సాలూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,స్నేహితులు,పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.(Story : అత్యాధునిక వసతులతో నీహల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం   )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version