శ్రీశ్రీశ్రీ జ్ఞాన సరస్వతిఅమ్మ వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవములో పాల్గొన్న మాజీ మంత్రి
న్యూస్ తెలుగు/వనపర్తి : రాజపేట గ్రామము శ్రీశ్రీ రాజేశ్వరసహిత రాజేశ్వరస్వామి మరియు వీరాంజనేయ స్వామి దేవాలయములో 3రోజుల నుండి అత్యంతవైభవంగా శ్రీశ్రీశ్రీ జ్ఞానసర్వతి అమ్మ వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమము ఘనంగా జరుగుతుంది. ఉత్సవకమిటీ ఆహ్వానం మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆలయ మర్యాదలతో సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత వైభవంగా నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులను సన్మానించి అభినందించారు.నిరంజన్ రెడ్డి వెంట మాణిక్యం, సుదర్శన్ రెడ్డి మాధవ్ రెడ్డి,రఘువర్ధన్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి, సంపత్ కుమార్ రెడ్డి చిట్యాల.రాము వెంకటేష్ నాయక్ అశోక్ తదితరులు ఉన్నారు.(Story : శ్రీశ్రీశ్రీ జ్ఞాన సరస్వతిఅమ్మ వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవములో పాల్గొన్న మాజీ మంత్రి)
