Home వార్తలు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్ నభా నటేష్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్ నభా నటేష్

0

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్ నభా నటేష్

న్యూస్‌తెలుగు/ హైద‌రాబాద్ సినిమా: ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చెట్టును కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది హీరోయిన్ నభా నటేష్. ఆమె ఇన్ స్టా గ్రామ్ ద్వారా చేసిన ఈ పోస్ట్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్ట్ తో నేచర్ గురించి నభా బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చిందంటూ నెటిజన్స్ కామెంట్స్ రాస్తున్నారు. తన సోషల్ మీడియా పోస్ట్ లో నభా స్పందిస్తూ –  ఈ రోజు ఒక చెట్టును కౌగిలించుకున్నాను…ఆ చెట్టు కూడా నన్ను తిరిగి కౌగిలించుకుందనే భావన కలిగింది. ఎంతో అందమైన ఈ ప్రపంచాన్ని చూసేందుకు వచ్చిన అతిథులం మనం. ఇక్కడ ప్రకృతి మనకెన్నో గొప్ప అనుభవాలు ఇస్తోంది. ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని అనుభూతి చెందడం మాత్రమే మనకున్న హక్కు. ఈ సంతోషాలు ఇచ్చిన నేచర్ కి రుణపడి ఉంటాను. అని పేర్కొంది.

ప్రస్తుతం పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ లో నటిస్తోంది నభా నటేష్. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభుతో పాటు మరో ప్రెస్టీజియస్ మూవీ నాగబంధంలో నటిస్తోంది. ఈ రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి. త్వరలో స్వయంభు, నాగబంధం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరికొన్ని క్రేజీ చిత్రాలు నభా లైనప్ లో ఉన్నాయి.(Story:ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్ నభా నటేష్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version