Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్న జూన్ 4

రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్న జూన్ 4

రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్న జూన్ 4

కూటమి ప్రభుత్వం తొలి ఏడాది సాధించిన విజయాలు ప్రారంభం మాత్రమే
రాజకీయ పతనం, ప్రజల తీర్పును జీర్ణించుకోలేకే వైకాపా నిరసనలు: జీవీ

న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్ర చరిత్రలోనే జూన్ 4, 2024, ప్రజల పోరాట దినంగా, గడిచిన ఏడాదంతా సుపరిపాలన సంవ త్సరంగా చరిత్రలో చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోనున్నాయని చీఫ్‌విప్‌, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుులు అన్నారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు వైకాపా అవినీతి, అరాచక పాలన వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా నిలిచి, కూటమికి ఘనవిజయం అందించారని హర్షం వ్యక్తం చేశారు. నాడు ప్రజలు ఇచ్చిన తీర్పు బలంతోనే సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారని, ఇలాంటి రోజు ను వెన్నుపోటు దినంగా పాటించడం వైకాపా దివాళకోరుతనం, నీచత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. మొత్తం 175కి 164 అసెంబ్లీ, 25కి 21 పార్లమెంట్ సీట్లలో కూటమిని గెలిపించిన తీరు తమపై ప్రజల నమ్మకానికి ప్రతి రూపంగా పేర్కొన్నారు. ప్రజల ఆ ఆకాంక్షలు నెరవేర్చేందుకే తెలుగుదేశం, జనసేన, భాజపా పార్టీ లు కట్టుబడి పనిచేస్తున్నాయన్నారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూ కబ్జాలతో ప్రజలను దోచుకుందని, పరిశ్రమల్ని తరి మివేసి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసిన వైకాపాకు భిన్నంగా అన్నిరంగాల్లో ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు చర్యలు చేపడుతున్నారని, ప్రజలంతా కూడా ఆ ప్రయత్నాలను గుర్తిస్తున్నారని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణ పున:ప్రారంభం, పోలవరం పరుగులే అందుకు కళ్ల ముందు కనిపిస్తోన్న ఉదాహరణలన్నారు. ఏడాదిలో సాధించిన పురోగతి, రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలపడానికి బలమైన పునాది వేసిందన్నారు జీవీ. ఇలాంటి పరిస్థితుల్లో అభినందించాల్సింది పోయి ప్రతిపక్ష వైకాపా ఈ విజయ వేడుకలను “వెన్నుపోటు దినం”గా ధర్నాలు చేయడం వారి వక్రబుద్ధిని తెలియజేస్తోందన్నారు. వారి ధర్నాలు, నిరసనలు రాజకీయ పతనం, ప్రజల తీర్పును జీర్ణించుకోలేని నిస్సహాయతనే తెలియజేస్తున్నాయన్నారు. ఇకనైనా జగన్, వైకాపా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. ఈ ఏడాది సాధించిన విజయాలు కేవలం ఆరంభమే మాత్రమే అన్న చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులుఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడానికి కూటమి ప్రభుత్వం కృషి కొనసాగుతునే ఉంటుందని ప్రజలకు భరోసా ఇస్తున్నామన్నారు. (Story:రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనున్న జూన్ 4)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!