పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చాలి
ఉలవలపూడి రాము సిపిఐ పట్టణ కార్యదర్శి వినుకొండ
న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు సొంత ఇంటి కల వెంటనే నెరవేర్చాలని సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాడు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ మండల కేంద్రాలలో తలపెట్టిన ఇళ్లస్థలాల కొరకై వినుకొండ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ. గత వైసిపి ప్రభుత్వం పట్టణాల్లో ఇచ్చిన సెంటు భూమిని పక్కా గృహం నిర్మించుకొనుటకు ఆ ప్రభుత్వం గ్రాంట్ చేసిన 1,80,000 రుణం సరిపోదని కూటమి ప్రభుత్వం అధికారంలోకివస్తే రెండు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని అందులో పక్కా గృహము నిర్మించుకునేందుకు నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించి ఉన్నారు. ప్రజలు కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం కావస్తున్న ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఎప్పుడు నెరవేరుస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని కావున అర్హులైన వారందరికీ ఇంటి స్థలము రెండు సెంట్లు ఇచ్చి పక్కా గృహం నిర్మించుకొనుటకు ఐదు లక్షలు రూపాయలు ఇవ్వాలని ఆయన కోరారు. వయసు పైబడి బ్రతుకు భారమై ఎదుటివాని సహాయం కొరకు ఎదురుచూస్తున్న వయోవృద్ధులు,వితంతువులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు అర్హులైన వారందరికీ పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని, రేషన్ కార్డులు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని ఆయన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు పటాన్ లాల్ ఖాన్, పోట్లూరి వెంకటేశ్వర్లు, షేక్ నాగూర్, తోట నరసింహారావు, అల్లా బక్షు, షేక్ చిన్న సైదా, టంగుటూరి సుబ్రహ్మణ్యం, సుబ్బారావు, ఎంగల బ్రహ్మం, చిన్న వెంకటేశ్వర్లు, షేక్ ఫాతిమ, మున్ని, అఫ్రీం, షైదాబి, గౌసియా, రజియా, సుల్తానా, మహబ్బి, కరిమున్ తదితరులు వందలాదిమంది ఈ ధర్నాలో పాల్గొన్నారు ధర్నా అనంతరం మండల తాసిల్దార్ గారికి వినతిపత్రాన్ని వ్యక్తిగత అర్జీలను సమర్పించారు. తహసిల్దార్ సురేష్ నాయక్ మాట్లాడుతూ. పది రోజుల్లో ఎంక్వైరీ చేయించి లబ్ధిదారులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. (Story:పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చాలి)
