Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కళా రత్న అవార్డు అందుకున్న కవి కమలా రామ్

కళా రత్న అవార్డు అందుకున్న కవి కమలా రామ్

కళా రత్న అవార్డు అందుకున్న కవి కమలా రామ్

న్యూస్ తెలుగు/వినుకొండ  : మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో మే 31 న త్యాగరాయగాన సభ లో జరిగిన కళా సాహితీ సేవ అవార్డుతో రచయిత,జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు,జాషువా సమాఖ్య గౌరవ అధ్యక్షులు కమలా రామ్ ని సత్కరిస్తున్న సినీ నటుడు పృథ్వీరాజ్ , మెగా హెల్పింగ్ అధ్యక్షురాలు శ్రీమతి శిరీష, డి.ఎస్.పి, బుల్లితెర కళాకారులు వసంత్, నైనిష ఈ సందర్భంగా మెగా హెల్పింగ్ ఫౌండేషన్ ఎండి శ్రీమతి శిరీష రెడ్డి మాట్లాడుతూ. పేరెన్నికగన్న ఎంతోమంది కవులు, కళాకారులను గుర్తించి వారి కళాసేవలకు గాను 2025 – గోల్డ్ సార్ సాహితి ప్రతిభ అవార్డులు అందిస్తున్నామని,అన్ని అర్హతలు కలిగి, 40 సంవత్సరాలుగా సాహితీ సేవలు అందిస్తున్న వినుకొండ కు చెందిన కమలా రామ్ కు గోల్డ్ స్టార్ కళారత్న అవార్డుకు ఎంపిక చేసి అవార్డు అందజేశామన్నారు. కళా రత్న అవార్డు అందుకున్న కమలారామ్ ని పలువురు కవులు, మిత్రులు, కళాకారులు,కళా సంస్థలు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తనను అవార్డుతో గౌరవించిన మెగా హెల్పింగ్ ఫౌండేషన్ వారికి కమలారామ్ కృతజ్ఞతలు తెలిపారు.(Story : కళా రత్న అవార్డు అందుకున్న కవి కమలా రామ్ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!