జూలై 15 16 తేదీలలో సామర్లకోటలో కాకినాడ ద్వితీయ జిల్లా మహాసభలు
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేవరకు పోరాటం ఆపే ప్రసక్తి లేదు
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు
న్యూస్ తెలుగు / చింతూరు : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ ద్వితీయ జిల్లా మహాసభలు జూలై 15 16 తేదీలలో సామర్లకోటలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు వెల్లడించారు.శుక్రవారం ఉదయం స్థానిక విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో జిల్లా మహాసభలు విజయవంతానికి జిల్లా విస్తృత సమావేశం పి సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది.ముందుగా ఇటీవల మరణించిన మృతవీరులకు రెండు నిమిషాల పాటు సంతాపం తెలియజేయడం జరిగింది.అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహాసభల కాలం ప్రారంభమైందని ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శాఖ మహాసభలు జరుగుతున్నాయని జూన్ మాసంలో కాకినాడ జిల్లాలో పట్టణ ,మండల మహాసభలు పూర్తిచేసుకుని జూలై 15 16 కు జిల్లా మహాసభలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అర్బన్లో రెండు సెంట్లు రూరల్ లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇప్పటికే సిపిఐ ఆరు నెలలుగా పలు దశల్లో ఉద్యమాలు నిర్వహించిందని ఆయా పేదవారి దరఖాస్తులు తాసిల్దార్లకు జిల్లా కలెక్టర్కు అందజేశామని అయినా పేదవాడికి ఇల్లు ఇవ్వడంలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.సూపర్ 6 హామీలు కూడా ఇప్పటికీ అమలు చేయలేదని ఆయన తెలిపారు కాకినాడ జిల్లాలో ఇసుక మట్టి అవినీతి వ్యాపారం జోరుగా సాగుతుందని దీనిపై పలు ఫిర్యాదులు చేసిన స్పందించే నేతలు కరువయ్యారని ఆయన విమర్శించారు. అధికారంలోకి రాగానే మున్సిపల్ భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన నాయకులు ఇప్పటికీ వారి హామీలు నెరవేర్చలేదని మధు అన్నారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి కే బోడకొండ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో అనేక ప్రజా సమస్యలు నెలకొని ఉన్నాయని ముఖ్యంగా యు కొత్తపల్లి మండలం కొమరగిరి లేఔట్ లో సిపిఐ దరఖాస్తు చేసిన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన కోరారు.ఇంకా ఈ సమావేశంలో సిపిఐ పిఠాపురం నియోజకవర్గ కార్యదర్శి కేశవరపు అప్పలరాజు మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ ఏ భవాని పెద్దాపురం పట్టణ కార్యదర్శి రామకృష్ణ కార్మిక నాయకులు కిషోర్ ప్రజానాట్యమండలి జిల్లా కన్వీనర్ మండల రమణ అర్జున్ రావు శివాజీ పి రాజేశ్వరరావు ఎస్ శంకర్ రమణ తదితరులు ప్రసంగించారు.(Story : జూలై 15 16 తేదీలలో సామర్లకోటలో కాకినాడ ద్వితీయ జిల్లా మహాసభలు )
