Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ వినుకొండలో 26 కంపెనీలతో మెగా ఉద్యోగ మేళా

వినుకొండలో 26 కంపెనీలతో మెగా ఉద్యోగ మేళా

0

వినుకొండలో 26 కంపెనీలతో మెగా ఉద్యోగ మేళా

నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని జీవీ పిలుపు

న్యూస్ తెలుగు/వినుకొండ : జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం వినుకొండలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్న ట్లు ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి టెక్ మహీంద్రా, డైకిన్, అప్స్‌టెక్‌ సొల్యూషన్స్, అమర్‌రాజా, ముత్తూట్ ఫైనాన్స్, హీరో మోటో కార్ప్, హెటిరో, అపెక్స్ సొల్యూషన్స్, మెడ్‌ప్లస్, ఎస్‌బీఐ కార్డు సహా 26 సంస్థల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బి-ఫార్మసీ, ఎం-ఫార్మసీ, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన నిరుద్యోగ యువత ఎవరైనా ఈ అవకాశం సద్వినియో గం చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేళా కొనసాగుతుందని.. 18- 40 ఏళ్లలోపు నిరుద్యోగులు బయోడేటా, సర్టిఫికేట్లతో నేరుగా హాజరు కావచ్చని తెలిపారు. ఐటీ, ఫైనాన్స్, పరిశ్రమలు, తయారీ, సాఫ్ట్‌వేర్, రిటైల్ రంగాల్లో ఉద్యోగ అవకశాలు కల్పిస్తారన్నారు. ఎంపికైన వారికి రూ.12 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం లభిస్తుందని, చదువుకున్న యువతీ యువకులు ఈ జాబ్‌మేళాను ఉపయోగించుకోవాలని కోరారు. వినుకొండ ప్రాంతంలో చదువుకు న్న ప్రతిఒక్క యువతీయువకులకు ఉద్యోగాలు ఇప్పించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నానని తెలిపారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగానే వినుకొండలో ఈ ఉద్యోగ మేళా ఏర్పాటు చేశామన్నారు. ప్రతి 6 నెలలకోసారి ఉద్యోగ మేళా పెట్టించి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.(Story : వినుకొండలో 26 కంపెనీలతో మెగా ఉద్యోగ మేళా )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version