బి,ఆర్ఎస్ మాజీ ఎంపిటిసిని పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి మండలం, కడుకుంట్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపిటిసి రాంచందయ్య యాదవ్ కి గత కొద్ది రోజుల క్రితం ఆక్సిడెంట్ కావడం జరిగింది. ఇట్టి సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పరామర్శించి మనో ధైర్యం ఇచ్చారు. గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సోషల్ మీడియా మండల కన్వీనర్ మనీష్ గారి మాతృమూర్తి కీ”శే ” వాకిటి రాములమ్మ ,అలాగే బిఆర్ఎస్ కార్యకర్త హరినారాయణ తండ్రి కీ” శే” చిలుక రాములు గారి చిత్ర పటాలకు నివాళులు అర్పించిన మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. వారి కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ జేశారు. మాజీ మంత్రి వెంట బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం సీనియర్ నాయకులు శివన్న సుధాకర్ ఆచారి హరిత బాలకృష్ణ సువర్ణ శ్రీనివాసులు , చిలుక సత్యం సాగర్ , గ్రామ అధ్యక్షులు చిలుక వెంకట్ సాగర్ , సింగిల్విండో డైరెక్టర్ చిన్నారెడ్డి , గుండెల తిరుపతయ్య యాదవ్, మహేష్ గౌడ్ , గోవిందరాజ్ , లక్ష్మి కాంత్ రెడ్డి అశోక్ గౌడు హరీష్ సాగర్ చింతకాయల బాలరాజు , బాలరాజు యాదవ్ , తోక తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. (Story:బి,ఆర్ఎస్ మాజీ ఎంపిటిసిని పరామర్శించిన మాజీ మంత్రి)

