ఇంటర్మీడియట్ నందు ప్రతిభ చాటిన హసితశ్రీని సన్మానించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : కె.డి.ఆర్(32వార్డ్)కు చెందిన వరప్రసాద్ గుప్తా కుమార్తె హసితశ్రీ ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ ఎం.పి.సి గ్రూప్ నందు 470 మార్కులకుగాను 466 సాధించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ చిరు వ్యాపారి(టీ కొట్టు)కూతురు పట్టుదలతో చదివి అగ్రర్యాంక్ సాధించడం అభినందనీయం అని ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని అన్నారు.హసితశ్రీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఐ. ఐ.టి ప్రిపరేషన్ కోసం తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమములో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్,పెండెం.కురుమూర్తి యాదవ్,మాణిక్యం,నాగన్న యాదవ్, జోహెబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. (Story:ఇంటర్మీడియట్ నందు ప్రతిభ చాటిన హసితశ్రీని సన్మానించిన మాజీ మంత్రి)

