కుళ్ళిన మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
న్యూస్ తెలుగు/సాలూరు: ప్రజలకు హాని కలిగించే కుళ్ళిన మాంసం, చేపల విక్రయించిన, తూనికలు కొలతలలో మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని. సాలూరు మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ లావేటి బాలకృష్ణ అన్నారు. మంగళవారం పెద్ద మార్కెట్ లో ఉన్న చేపలు, కోళ్లు షాపులపై ఆయన ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నిల్వ ఉంచిన 10 కేజీల కోడి మాంసంను స్వాధీనం చేసుకుని, వారిపై అపరాధ రుసుము వసూలు చేశారు.ఈ సందర్భంగా సానిటరీ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ సాలూరు పురపాలక సంఘ పరిధిలో గౌరవ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజారోగ్య సిబ్బంది రోజువారి విధుల్లో భాగంగా, చేపలు, కోడి మాంసం, మరియు వాణిజ్య సముదాయాలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా.10 కేజీల పాడైన కోడి మాంసాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. అదేవిధంగా 4 kg ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. అలాగే పరిశుభ్రత పాటించని విక్రయదారులకు 6000 రూపాయల అపరాద రుసుం విధించడం జరిగిందని తెలిపారు .తూనికలలో తేడాను గమనించి సంబంధిత శాఖ వారికి రాతపూర్వకంగా తెలియజేస్తామని అన్నారు. వారిని హెచ్చరించడం జరిగిందని అన్నారు .ఈ సందర్భంగా సదరు వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించి, మీరు చేస్తున్న వ్యాపార పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (పునర్వినియోగం కానీ ప్లాస్టిక్) ను వాడరాదని వారికి తెలియజేశారు. ఆరుబయట చెత్తలు వేయరాదని కొలతలలో తేడాలుచేసి ప్రజలను మోసం చేయరాదని అన్నారు కుళ్ళిన పాడైన, మాంసాన్ని అమ్మ రాదని అలా కాకుండా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు . )(Story:కుళ్ళిన మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు)

