రేషన్ షాప్ ల వద్ద వసతులు కల్పించండి
తహసీల్దార్ సురేష్ నాయక్
న్యూస్ తెలుగు / వినుకొండ : జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం వినుకొండ మండల పరిధిలోని రేషన్ డీలర్లకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీలర్లు అందరికి తహశీల్దారు సురేష్ నాయక్ సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జూన్ నెల నుండి ఒకటవ తారీఖున కార్డుదారులకు రేషన్ సరుకులు, రేషన్ షాపు వద్ద పంపిణీ చెయ్యడానికి నిర్ణయించినదని, రేషన్ షాప్ వద్ద సరుకులు పంపిణీ విషయం ప్రతి ఒక్క కార్డుదారునికి తెలిసే విధంగా పబ్లిసిటీ చెయ్యాలని, ప్రతి నెల 1వ తారీకు నుండి 15 వ తారీకు వరకు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు రేషన్ డీలరు రేషన్ షాపు వద్ద అందుబాటులో ఉండి సరుకులు పంపిణీ చెయ్యాలని, షాపులు వద్ద కార్డుదారులకు ఇబ్బంది లేకుండా కుర్చీలు, వాటర్ సదుపాయం ఏర్పాటు చేయాలని, రేషన్ షాపులు పరిశుభ్రంగా ఉంచాలని, కార్డుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరుకులు పంపిణీ చేయాలని తహసీల్దార్ సురేష్ నాయక్ సూచనలు చేశారు. (Story:రేషన్ షాప్ ల వద్ద వసతులు కల్పించండి)

