త్రాగునీటి కోసం బోర్ వెల్ ఏర్పాటు
న్యూస్ తెలుగు/చింతూరు : మండలంలోని వేగతోట చెరువు గుంపు బండారుగూడెం గ్రామాల్లో జెకె సిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాగునీటి బోరు వేయడం జరిగింది. వేసవికాలం ఉష్ణోగ్రతల పెరగడంతో త్రాగునీటి జలాలు చెరువుల్లో వాగుల్లో ఇంకిపోవడంతో ప్రజలు సాగునీటికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వేగి తోట బండారి గూడెం గిరిజనులు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాఖాన్ని కలిసి తాగునీటి సమస్యను విన్నవించారు. వెంటనే ఆయన స్పందించి రెండు గ్రామాలకు త్రాగునీటి బోర్లను వేయించడం జరిగింది. కోరిన వెంటనే గ్రామస్తుల మంచినీటి సమస్యను పరిష్కరించిన జమాల్ ఖాన్ కు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుర్రం సూర్యనారాయణ, కమలమ్మ, కిట్టమ్మ, సౌజన్య, శ్వేత, కన్నమ్మ, సుబ్బయ్య, సత్యవతి, రమేష్, విజయ్, దూలయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు పి సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.(Story : త్రాగునీటి కోసం బోర్ వెల్ ఏర్పాటు )

