రెండొవ రోజు ఆకట్టుకున్న నాటిక ప్రదర్శనలు
న్యూస్ తెలుగు /వినుకొండ : నందమూరి తారక రామారావు కళాపరిషత్ నాటకోత్సవాలు రెండవ రోజు మంగళవారం రాత్రి సందడిగా నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన గోనుగుంట్ల సత్యనారాయణ, మక్కెన చినరామయ్య కళాపరాంగణంలో జనసేన వీర మహిళలు జ్యోతి వెలిగించగా, జనసేన పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కొంజేటి నాగ శ్రీను, జిల్లా కార్యదర్శి ఎన్. శ్రీనివాసరావు నటరాజ పూజ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం కళాకారులు నాటికలు ప్రదర్శించారు. పొట్ల రాధాకృష్ణమూర్తి, పారా లక్ష్మయ్య, మాదినేని ఆంజనేయులు నాటక ప్రదర్శనలను నగదు ప్రోత్సాహం అందజేశారు. కళాపరిషత్తు అధ్యక్షులు న్యాయవాది రామకోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ముత్తినేనిగిరి బాబు, కార్యక్రమ నిర్వాహకుడు మాజీ ఎంపీపీ బొల్లా వెంకట కోటయ్య వారికి సహకరించారు. సామాజిక మాధ్యమాలకు బానిస కావద్దు వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలను అవసరం మేరకే వినియోగిస్తే నష్టం లేదు అలా కాకుండా 24 గంటలు వాటిలో మునిగి సంసారాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే పరిణామాలను కంటికి కంటినట్లు యువభేరి థియేటర్స్ హైదరాబాదు వారి “నా శత్రువు” నాటిక చక్కటి సందేశాన్ని ఇచ్చింది అక్కల తామేశ్వరయ్య రచించగా వద్దాది సత్యనారాయణ దర్శకత్వం వహించారు. మరో నాటిక “మా ఇంట్లో మహాభారతం” లో పాతిక ఎకరాల పొలం ఉండి వ్యవసాయం చేస్తున్న యువకులకు పెళ్లిళ్లు కావడం కష్టంగా ఉందని పదివేల జీతంతో పట్నంలో ఉద్యోగం చేస్తున్న వారిని వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు అన్నది ఈ నాటిక వితివృత్తం, ఇలాగే కొనసాగితే పొలం పండించేవారు ఉండరని చివరికి బస్తా డబ్బులు ఇచ్చిన గింజలు కొనలేని పరిస్థితి దాపురిస్తుందన్న సందేశాన్ని ఇచ్చింది మద్దుకూరి ఆర్ట్స్ చిలకలూరిపేట కళాకారులు ప్రదర్శించిన హాస్య భరితమైన ఈ నాటికను మద్దుకూరి రవీంద్ర రచించగా నడింపల్లి వెంకటేశ్వర్లు దర్శకత్వం వహించారు. హైదరాబాద్ సిరిమువ్వ కల్చరర్ వారు “హక్కు” నాటికను కళాకారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రభుత్వ చిఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాల్గొని నాటక కళాకారులకు పారితోషకం అందజేశారు. కార్యనిర్వకులు ముత్తినేని గిరిబాబు, బొల్ల వెంకట కోటయ్య, లాయర్ రామకోటేశ్వరరావు, లగడపాటి వెంకట్రావు, మంద మరియబాబు, గాలి రేవతి శ్రీనివాసరావు, పెనుగొండ శ్రీనివాసరావు, లాయర్ సైదారావు, వార్డు కౌన్సిలర్ దస్తగిరి షకీలా, పీవీ సురేష్ బాబు, 32 వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు. (Story:రెండొవ రోజు ఆకట్టుకున్న నాటిక ప్రదర్శనలు)