Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ భారతదేశం సత్తాను ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సిందూర్

భారతదేశం సత్తాను ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సిందూర్

0

భారతదేశం సత్తాను ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సిందూర్

తిరంగా ర్యాలీలో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ, జీడీసీసీడబీ ఛైర్మన్ మక్కెన

న్యూస్ తెలుగు /వినుకొండ : పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా సైనిక బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ భారతదేశం సత్తా ను ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. భారత సైనిక శక్తి, సంకల్పానికి నిదర్శనంగా నిలిచిన ఆపరేషన్‌లో సైన్యం ధైర్యసాహసాలు, లక్ష్యాల్ని తుత్తునియలు చేసిన సాంకేతికతలపై అంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారన్నారు. కశ్మీ ర్‌లో అమాయకులను బలితీసుకున్న ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పిన ప్రధాని మోదీ, ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన త్రివిధ దళాలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ మేరకు సైనికులను అభినందిస్తూ శుక్రవారం వినుకొండలో భారీగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా గీతాలు ఆలపించారు. భారత్ మాతాకీ జై, జైహింద్, వందేమాతరం వంటి నినాదాలు అంతటా మార్మోగాయి. ఈ సందర్భంగా మాట్లాడి న చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు శత్రుదేశంపై ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడిన వీరజవాన్లకు సెల్యూట్ చేస్తున్నామన్నారు. ఈ పోరాటంలో అమరుడైన వీరజవాన్ మురళీనాయక్‌కు జోహార్లు అర్పిస్తున్నామన్నారు. మురళీనాయక్ కుటుంబానికి సీఎం చంద్రబాబు, ప్రభుత్వం కూడా అండగా నిలబడిందని, రూ.50 లక్షల నగదుతో పాటు 5 ఎకరాల భూమి ప్రకటించారన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆపరేషన్ సిందూర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించి దేశానికి అండగా నిలబడ్డారన్నారు. 145 కోట్ల మంది భారత జాతి.. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీలు కుల, మతాలకు అతీతంగా తామంతా ఒక్కటేనని సమైక్యతను చాటి చెప్పారన్నారు. ఈ తిరంగా యాత్ర జాతీయ ఐక్యత చిహ్నమని, అన్నివర్గాల ప్రజల్ని ఒక్కతాటి పైకి తెచ్చి, సైన్యానికి గౌరవ వందనం, దేశభక్తిని బలోపేతం చేసే ప్రయత్నమని చెప్పారు. ఇకపై ఉగ్రవాదులు దేశంవైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా ఆపరేషన్ సిందూర్ నిర్వహించారని, ఈ పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులతో పాటు జీడీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఎన్ శ్రీనివాసరావు, కె. నాగ శ్రీను, పెమ్మసాని నాగేశ్వరరావు, వీరయ్య, ప్రశాంత్, షకీలా, మెప్మా సిబ్బంది, విద్యార్థులు, యువత, కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వినుకొండ మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన శివయ్య స్తూపం, కారంపూడి రోడ్డు, సురేష్ మహల్ రోడ్డు మీదుగా సాగింది. (Story:భారతదేశం సత్తాను ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సిందూర్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version