Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ ఆపరేషన్ సింధూర్ విజయానికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది

ఆపరేషన్ సింధూర్ విజయానికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది

0

ఆపరేషన్ సింధూర్ విజయానికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది

న్యూస్ తెలుగు/సాలూరు :  ఆపరేషన్ సింధూర్ దేశ ప్రజలందరికీ గర్వకారణమైన విజయమని. దేశ భద్రతను కాపాడేందుకు త్రివిధ దళాల సంకల్పంతో ఈ ఆపరేషన్ విజయం సాధించారని. ఈ అఖండ విజయానికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శుక్రవారం సాలూరు మున్సిపల్ కార్యాలయం నుండి బోసు బొమ్మ జంక్షన్ వరకు తిరంగా యాత్రలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ ప్రజలు త్రివిధ దళాల సైతం సమిష్టిగా కృతజ్ఞతాబినందనలు తెలియజేసే సమయం ఆసన్నమైందని తెలిపారు.. ఆపరేషన్ సింధూర్ అఖండ విజయం సాధించడం పట్ల దేశ సైనిక దళాలు చూపిన శౌర్య, ధైర్య మరియు త్యాగాలను గౌరవించడానికి తిరంగా యాత్ర చేస్తున్నామని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే ఒక గొప్ప విజయ యాత్ర అని అన్నారు.
ఈ యాత్ర రాజకీయాలకు పూర్తి అతీతం. రాష్ట్ర పౌరులందరూ ఈ యాత్రలో భాగం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కృష్ణారావు, తహసిల్దార్ రమణ, ఎంపీడీవో పార్వతి ఉద్యోగస్తులు నాయకులు పాల్గొన్నారు. (Story:ఆపరేషన్ సింధూర్ విజయానికి దేశం మొత్తం సెల్యూట్ చేస్తోంది)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version