Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ గుండ్లకమ్మ నదిపై వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

గుండ్లకమ్మ నదిపై వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

0

గుండ్లకమ్మ నదిపై వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి

న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ నియోజకవర్గం, అందుగుల కొత్తపాలెం వద్ద గుండ్లకమ్మ నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన పనులను ప్రభుత్వ చీఫ్ విప్,శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వంతెన నిర్మాణ పనుల పురోగతిని, నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ వంతెన అందుగుల కొత్తపాలెం పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా వర్షాకాలంలో గుండ్లకమ్మ నది ఉధృతి కారణంగా తలెత్తే ఇబ్బందులను నివారిస్తుందని చీఫ్ విప్ జీవి అన్నారు. వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు , కూటమి నాయుకులు అధికారులు పాల్గొన్నారు.(Story:గుండ్లకమ్మ నదిపై వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version