Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ హనుమాన్ నగర్ లో వోల్టేజి సమస్యను పరిష్కరించండి..

హనుమాన్ నగర్ లో వోల్టేజి సమస్యను పరిష్కరించండి..

0

హనుమాన్ నగర్ లో వోల్టేజి సమస్యను పరిష్కరించండి..

న్యూస్ తెలుగు / వినుకొండ : పట్టణంలోని హనుమాన్ నగర్ ఒకటి ,రెండు, మూడు , నాలుగు లైన్లకు సంబంధించి అక్కడ నివసిస్తున్న ప్రజలకు కరెంటు సప్లై చాలా తక్కువ వోల్టేజీ వస్తున్న కారణంగా టీవీలు, ఏసీలు, ఫ్రిజ్లు ఒక్కసారిగా షార్టేజ్ లకు గురి అయ్యి చెడిపోతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ముఖ్యముగా సాయంత్రం 8 గంటల నుండి లో ఓల్టేజీతో ఫ్యానులు కూడా సరిగా తిరగక, ఇళ్లలో ఊపిరాడక పసిపిల్లలు, వృద్ధులు, ఇళ్లలో మహిళలు అల్లాడిపోతున్నారు. లో వోల్టేజ్ పుణ్యమా అని ఏసీలు పనిచేయుటలేదు, దోమలు కుట్టి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కావున ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్ మార్చుటం లేదా ఎక్కువ పవర్ కలిగిన ట్రాన్స్ఫార్మర్ వెయ్యాలని ,త్రీఫేస్ కరెంటు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే హనుమాన్ నగర్ ప్రజల సమస్యని పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను మరియు ఎలక్ట్రికల్ ఇంజనీర్ లను కోరారు. సమస్య పరిష్కారం చేయని యెడల కరెంట్ ఆఫీస్ వద్దకు అక్కడ ప్రజలందరూ వచ్చి అధికారుల దృష్టికి వచ్చేలా నిరసన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.మారుతి వరప్రసాద్, పవన్ కుమార్, బూదాల నాగయ్య, షేక్ మస్తాన్వలి ,షేక్ నాగూర్ ,ఎం.సుబ్బారావు.   (Story:హనుమాన్ నగర్ లో వోల్టేజి సమస్యను పరిష్కరించండి..)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version