రాష్ట్ర ప్రభుత్వానికి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కృతజ్ఞతలు
న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్రంలోని వివిధ సంస్థల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల గురించి ముఖ్యమంత్రి కి లెటర్, పూర్వకంగా పంపించినందుకు మాచర్ల బుజ్జి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెంటనే స్పందించి రాష్ట్రంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా 25 వేల లోపు ఎవరైతే ఔట్సోర్సింగ్ ఉన్నారో వారికి అన్ని సంక్షేమ పథకాలు, రేషన్ కార్డు, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ మొదలైన వర్తింపజేసే విధంగా జీవో ఇవ్వాలని రాష్ట్ర వైద్య మిత్ర దళిత గిరిజన కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. (Story:రాష్ట్ర ప్రభుత్వానికి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కృతజ్ఞతలు)
