Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ హేమలత కు శాంతిదూత అవార్డు

హేమలత కు శాంతిదూత అవార్డు

0

హేమలత కు శాంతిదూత అవార్డు

న్యూస్ తెలుగు/చింతూరు : బలమైన దేశాన్ని నిర్మించడం లో మహిళల పాత్ర అనిర్వచనీయమని ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ ఖంభంపాటి హరిబాబు కొనియాడారు.ప్రపంచ మాతృ దినోత్సవం పురస్కరించుకొని భువనేశ్వర్ లో మా ఘోరో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాత్రికేయం,సామాజిక సేవ, ఆరోగ్య సంరక్షణ, మహిళా అవగాహన, విద్య, క్రీడలు తదితర రంగాల్లో అత్యుత్తమ కృషిచేసిన 10 మంది మహిళలకు శాంతి దూత అవార్డు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మారుమూల మల్కనగిరి లో గృహిణి గా ఉంటూనే పాత్రికేయ రంగంలో రాణిస్తున్న గోపి పట్నాయక్ సతీమణి డబ్బీరు హేమలత శాంతి దూత అవార్డు అందుకున్నారు. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం లో కొండ కోనల్లో సంక్లిష్ట వార్తల సేకరణలో సామాజిక చైతన్యానికి దోహదపడుతున్నందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహక సంస్థ మా ఘోరో ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఋతుపూర్ణ మహంతి తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్, న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, అడ్వకేట్ జనరల్ పీతాంబర ఆచార్య తదితరులు పాల్గొన్నారు. (Story:హేమలత కు శాంతిదూత అవార్డు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version