మోతుగూడెంలో అతిథి గృహాలను రిసార్ట్స్ లను చెక్ చేస్తున్న మోతుగూడెం ఎస్ఐ
న్యూస్ తెలుగు/చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసార్ట్ ల యాజమాన్లకు సోమవారం పలు సూచనలు చేశారు. మద్యం సేవించడం, గంజాయి సేవించడం, ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాలని యాజమాన్లకు తెలియజేశారు. అనంతరం అతిథి గృహాలకు కస్టమర్లు వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి యొక్క పేరు,ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, నమోదు చేసిన తర్వాత వారికి గదులు కేటాయించాలని రిసెప్షన్ బుక్కులో కచ్చితంగా వారి వివరాలు నమోదు చేయాలని అతిథి గృహాలు యజమానులకు తెలియజేశారు. అనంతరం కొత్త వ్యక్తులు , అనుమానస్పద వ్యక్తులు ఎవరైనా అతిథి గృహాలకు వస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఎస్సై సాదిక్ అతిథి గృహ యజమానులందరికీ తన ఫోన్ నెంబర్ 9440900757 తెలియజేశారు.(Story : మోతుగూడెంలో అతిథి గృహాలను రిసార్ట్స్ లను చెక్ చేస్తున్న మోతుగూడెం ఎస్ఐ )