Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 5వ శావల్యాపురం మండల మహాసభ

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 5వ శావల్యాపురం మండల మహాసభ

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 5వ శావల్యాపురం మండల మహాసభ

ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి

పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్

న్యూస్ తెలుగు/వినుకొండ  : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్లస్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని
సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం బొందిలి పాలెం గ్రామం లో జరిగిన సిపిఐ మండల మహాసభ కు సిపిఐ నాయకులు రాయబారం వందనం అధ్యక్షతవహించారు. సభ ప్రారంభానికి ముందుగా ఎర్రజెండాను సీనియర్ నాయకులు కామ్రేడ్ హనుమాన్ సింగ్ ఆవిష్కరించారు. అనంతరం మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన మారుతి మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలపై ఈనెల 20న జరగనున్న జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మండలంలోని గ్రామాలలో చెరువులను సాగర్ నీటితో నింపి పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని తల్లికి వందనం, రైతు రైతన్నకు 20,000 వేలు రూపాయలు, పేద మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇచ్చి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, నూతనంగా వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ వికలాంగ పెన్షన్లను వెంటనే విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించుటకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకోవాలన్నారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, రైతు నాయకులు ఉలవలపూడి రాము మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం ముఖ్యంగా మిర్చి పంట పండించిన రైతులు గిట్టుబాటు ధర రాక అల్లాడిపోతున్నారని క్వింటాలుకు 16 వేల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అర్హులైన వారందరికీ వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్ వెంటనే మంజూరు చేయాలన్నారు. స్మార్ట్ మీటర్లు ఎత్తివేయాలని పెంచిన కరెంట్ చార్జీలు తగ్గించాలని అధిక ధరలతో సతమతమవుతున్న ప్రజలకు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాయబారం వందనం, షేక్ కొండ్రముట్ల చిన్న సుభాని. ఎ. పవన్ కుమార్, కొప్పురపు మల్లికార్జున్ రావు, కొండలు, బోడిపుడి వెంకట్రావు, వివిధ గ్రామాలకు శాఖల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహాసభ 9 మందితో కూడిన నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. మండల కమిటీ కార్యదర్శిగా రాయబారం వందనం, సహాయ కార్యదర్శిగా హనుమాన్ సింగ్, కమిటీ సభ్యులుగా బోడాల వెంకటరావు, అమృతపూడి యోహాను, నక్కా శ్రీదేవి, రాపూరి లక్ష్మయ్య, ఎ.రాగమ్మ, ఆలేటి కోటేశ్వరరావు, మల్లారపు గురుస్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.(Story : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 5వ శావల్యాపురం మండల మహాసభ )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!