రక్త దానం, అవయదానం చేసి ప్రాణదాతలు కండి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రజలకు అత్యవసరమైన సేవలలో ఒకటైన రక్తం ఇది ఒకరు తయారు చేసేది కాదు ఒకరూ ఇస్తేనే వస్తుంది అలాంటిది 49 సార్లు ఇచ్చి 49 మందిని రక్షించిన మురళీకృష్ణ సమాజానికి ఎంతో సేవ చేశాడని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు
49 వ సారి రక్తదానం చేస్తున్న P.E.T మురళీకృష్ణ కు ఘనంగా సన్మానించారు. రక్తదానం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని కొత్త రక్తం వచ్చి మన ఆరోగ్యం బాగుపడుతుందని కనుక ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ఆపదలో ఉన్న వ్యక్తులకు ఉపయోగపడి జీవితాంతం రుణపడి ఉంటారని, రక్తదానం చేయాలని మురళి కృష్ణుడు లాంటి వారిని ప్రోత్సహించి ఆపదలో ఉన్న ప్రజలను కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు ex m.e.o ధర్మారెడ్డి, రెడ్ క్రాస్ సభ్యులు అహ్మద్, ఎస్సీ ,ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, నాయకులు గౌనికాడి యాదయ్య, కురుమూర్తి,శివకుమార్, తదితరులు పాల్గొన్నారు. (Story:రక్త దానం, అవయదానం చేసి ప్రాణదాతలు కండి)