శావల్యాపురం మండలంలో పెన్షన్ల తొలగింపు అవాస్తవం
– వైసీపీ నాయకుల దుష్ప్రచారం ఆపాలి
– పెన్షన్ లపై విచారణ జరుగుతుంది
– వైసీపీ వాళ్లు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి
న్యూస్ తెలుగు/వినుకొండ : శావల్యాపురం మండలంలో పెన్షన్ల తొలగింపు అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం అవాస్తమని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని టిడిపి మండల పార్టీ అధ్యక్షులు గుంటూరు సాంబశివరావు, విశ్వనాథం, టిడిపి నాయకులు ఆదివారం ఖండించారు. పెన్షన్లు తొలగించారంటూ వైసీపీ నాయకులు ఎంపీడీవో కార్యాలయం వద్ద చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. కొత్తలూరు గ్రామంలో 30 పెన్షన్లు తొలగించారని చెప్పడం పచ్చి అబద్ధమని, 5 వికలాంగుల పెన్షన్ల పై విచారణ జరుగుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తున్న నేటి ఓక్క పెన్షన్ కూడా తొలగించలేదన్నారు. వికలాంగుల పెన్షన్లలో అనర్హులు ఉన్నారని ప్రభుత్వం చేస్తున్న విచారణలో భాగంగా మండలం మొత్తం 489 పెన్షన్ లపై విచారించడం జరిగిందని, దానిలో 94 పెన్షన్లను జిజిహెచ్ నుండి వచ్చిన వైద్య అధికారులు పెండింగ్లో పెట్టి విచారిస్తున్నట్లు తెలిపారు. పొట్లూరు, పిచికల పాలెం, కొత్తలూరు మొత్తం 15 పంచాయతీల్లో పెన్షన్ తొలగించారని వైసిపి తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. పేదల పెన్నిధి ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పెన్షన్లు తొలగింపు అనేది సహించడని, ఇప్పటివరకు ఒక్క పెన్షన్ కూడా తొలగించడం జరగలేదన్నారు. వైసిపి ప్రభుత్వంలో అర్హులైన అమాయకులకు పార్టీని ఆపాదించి పెన్షన్లు, 18000 చేయూత పథకం తొలగించడం ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడింది వైసిపి నాయకులని వారు గుర్తు చేశారు. పెన్షన్లు తొలగింపు అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేయటం మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎర్ర మాస్ కోటేశ్వరరావు, గద్దె మస్తాన్ రావు, బోడిపుండి నాగేశ్వరరావు, వెంకట్ నారాయణ, సాదినేని కృష్ణ, పారా చౌదరి, మురళి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.(Story : శావల్యాపురం మండలంలో పెన్షన్ల తొలగింపు అవాస్తవం )