Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మే 18,19,20 వ తేదీలలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగ

మే 18,19,20 వ తేదీలలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగ

మే 18,19,20 వ తేదీలలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగ

న్యూస్ తెలుగు/సాలూరు : సాలూరు పట్టణంలో మే 18,19,20 వ తేదీలలో జరగబోయే శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగ సందర్బంగా పటిష్ట బందోబస్తు విధి విధానాలు పై పోలీసు అధికారులుకు, దేవాదాయ,ఆలయ కమిటీ సబ్యులకు దిశా నిర్దేశాలు చేసిన జిల్లా ఎస్పీ ఎస్.వి మాధవ్ రెడ్డి బుధవారం సాలూరు పట్టణంలో
పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని భక్తులకు సురక్షితమైన, సులభమైన దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
సిరిమాను/అమ్మవారి ఘటాలు తిరిగే ప్రతీ ప్రాంతాలని క్షుణ్ణంగా పరిశీలించి తగు
సూచనలు, సలహాలిచ్చారు. భక్తుల యొక్క వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రదేశాలలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
డ్రోన్ నిఘా నీడలో అమ్మవారి పండగ పరిపూర్ణంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చేయాలని అన్నారు. పట్టణంలోపురాతన భవంతులు, శిధిలావస్థలో ఉన్న భవంతులు గుర్తించి ముందస్తుగా తగు హెచ్చరికలు జారీచేస్తూ, భద్రత ప్రమాణల దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అమ్మవారి పండగ సందర్బంగా, పండగను తిలకించేందుకు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుండి ఎక్కువగా ప్రజలు, భక్తులు గ్రామానికి వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా వారి రాకపోకలకు, భద్రతకు ఎటువంటి అవాంతరం లేకుండా చర్యలు చేపట్టాలని, ఆలయల ప్రాంగణం,క్యులైన్ లో భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ముఖ్యంగా తోపులాటకు తావు లేకుండా ఎలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా, భక్తుల యొక్క వ్యక్తిగత భద్రతకు గట్టి భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. అదే విధంగా ఆలయం లోపల, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు మరియు చుట్టుపక్కల ప్రదేశాలలో సిసి కెమరాలను ఏర్పాటు చేయాలని, పండగ రోజుల్లో పట్టణం అంతటా డ్రోన్ పోలిసింగ్ నిర్వహించాలని, ఘటాలు, సిరిమాను తిరిగే ప్రదేశాలు, రద్దీగా వుండే ప్రదేశాలలో కూడా సిసి కెమరాలను ఏర్పాటు చేయలన్నారు. అలయప్రాంగనంలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి, సిసి కెమారాలను వాటికీ అనుసంధానం చేసి వాటిని ఎల్లప్పుడూ పరిశీలిస్తుండాలన్నారుతెలిపారు..నేరాల నియంత్రణకు ప్రత్యేక క్రైం బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు సూచనలు చేసేందుకు అన్ని ముఖ్య కూడళ్ళలో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ను కూడా ఏర్పాటు చేయాలని తెలియజేసారు. వాహనాల పార్కింగ్, దారి మళ్లింపు ఉన్న ప్రతి చోటా సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, ఎంట్రీ & ఎగ్జిట్ గేటుల వద్ద భక్తులకు సమాచారం పూర్తిగా తెలిసేలా హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలనీ, సిరిమాను తిరిగే మార్గంలో ఎక్కువ మంది ప్రజలు రాకుండా చూసేందుకు ఏరియా క్లియరెన్సు పార్టీలను, రోప్ పార్టీలను ఏర్పాటు చేయాలని, సిరిమాను తిరిగే ప్రదేశాలలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా రెవెన్యూ యంత్రాంగం, దేవాదాయ శాఖ ప్రోటోకాల్ సిబ్బంది, మున్సిపల్ తదితర సంబంధిత శాఖల వారితో సమన్వయం చేసుకుంటూ సజావుగా జరిగేలా చూడాలని ఆదేశాలిచ్చారు ఈ సమావేశంలో పాలకొండ డిఎస్పీ రాంబాబు, సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు, సాలూరు రూరల్ సిఐ రామకృష్ణ, పాచిపెంట ఎస్సై వెంకట సురేష్, మక్కువ ఎస్సై వెంకట రమణ మరియు దేవాదాయ,ఆలయ కమిటీ సబ్యులు పాల్గొన్నారు. (Story:మే 18,19,20 వ తేదీలలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి పండగ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!