రెండో రోజుకు చేరిన ఆర్టీసీ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు..
న్యూస్ తెలుగు /వినుకొండ : పెండింగ్లో ఉన్న సమస్యలు అయిన 1/2019 సర్క్యులర్ అమలు, ట్రాన్స్ఫర్ పాలసీ, అక్రమ సస్పెన్షన్లు, రిమూవర్స్, మహిళలకు చైల్డ్ కేర్ సెలవులు, ఈహెచ్ఎస్ స్థానంలో పాత పద్ధతిలో వైద్యం, డిప్యూటేషన్ విధానం కొనసాగింపు, ఆగిపోయిన ప్రమోషన్లు పునరుద్ధరణ సాధన కొరకు ఏపీ పిటిడి డిమాండ్ చేస్తూ, నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రెండవ రోజు మంగళవారం gbxవినుకొండ ఆర్టీసీ డిపో ప్రాంగణం లోని ఎన్.ఎం.యు కార్యాలయము నందు ఎన్ఎంయు కార్యదర్శి వి.ఎస్.పి నాయక్, ముప్పాళ్ళ శ్రీను ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష లు చేపట్టారు. ఈ కార్యక్రమానికి వినుకొండ ఆర్టిసి డిపో ఎన్.ఎం.యు.ఐ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు. ఈ దీక్ష కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆర్ శ్రీను, మస్తాన్, సీతారెడ్డి, రామారావు, కృపారావు, ఇజ్రాయిల్, కీర్తి, విజయలక్ష్మి, మేరీ కుమారి, రేవతి దీక్షలో పాల్గొన్నారు. (Story:రెండో రోజుకు చేరిన ఆర్టీసీ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు..)
