“మదర్ థెరీసా ఇండియన్ ఎక్సలెన్సీ అవార్డు” అందుకున్న గుమ్మడి
న్యూస్ తెలుగు /వినుకొండ : ప్రముఖ సామాజిక సేవ కార్యకర్త, చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వర్లు కి బెంగుళూరు కు చెందిన మదర్ తేరిసా ఫౌండేషన్ వారు “మదర్ థెరీసా ఇండియన్ ఎక్సలెన్సీ అవార్డు 2025″ అందజేశారు. ఈ అవార్డు అందుకున్నందుకు గాను చైతన్య స్రవంతి కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు, కళాకారులు, అభిమానులు అభినందనలు తెలిపారు. మానవసేవే మాధవసేవ గా భావించి గత 22 సంవత్సరాల నుండి 7వేల పైచిలుకు కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను మదర్ థెరీసా ఫౌండేషన్ వారు గుర్తించి ఈ అవార్డు ప్రకటించారు. అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి మరిన్ని అవార్డులు సాధించి వినుకొండకు గర్వకారణంగా నిలవాలని పలువురు ఆకాంక్షించారు. (Story:”మదర్ థెరీసా ఇండియన్ ఎక్సలెన్సీ అవార్డు” అందుకున్న గుమ్మడి)
