గిరిజన గ్రామాల్లో విస్తృతం గా స్ప్రేయింగ్
న్యూస్‌తెలుగు/ చింతూరు : ప్రాథమిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గిరిజన గ్రామాలైన తులసిపాక బొడ్రాయిగూడెం, రామన్న పాలెం ఐఆర్ఎస్ 5% ఏసీమ్. స్ప్రేయింగ్ చేయించడం జరిగింది. ఈ దోమల మందు పిచికారి కార్యక్రమము లో మేడికల్ ఆఫీసర్ డాక్టర్ వి. నిఖిల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని.దోమతేరలు వాడాలని కోరారు.దోమల మందు పిచికారి ఇంటి లోపల బయట మూలలలో చేయించాలని కోరారు.కొట్టించిన వెంటనే గదులను కడగ రాదన్నారు.మట్టిగోడలను అలకరాదని గ్రామ వాసులకు తెలియజేయడం జరిగింది. ప్రతి ఇంటిలో దోమల మందు పిచికారి చేయించారు . ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్.వి.నిఖిల్ సూపర్వైజర్ హెల్త్ అసిస్టెంట్ ఆశాలు పాల్గొన్నారు. (Story:గిరిజన గ్రామాల్లో విస్తృతం గా స్ప్రేయింగ్)
