Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ భూ సమస్యలపై తాసిల్దార్ కి వినతిపత్రం

భూ సమస్యలపై తాసిల్దార్ కి వినతిపత్రం

0

భూ సమస్యలపై తాసిల్దార్ కి వినతిపత్రం

న్యూస్ తెలుగు/సాలూరు : మండలంలో ఉన్న భూ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్ రమణ కి వినతిపత్రం ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు ఆదివాసి గిరిజన సంఘం సీనియర్ నాయకులు సూకూరు గంగయ్య మాట్లాడుతూ గతంలో సర్వేలు చేసిన వారికి అటవీ, బంజరు(డి కె టి) భూములకు పూర్తిస్థాయిలో పట్టాలు పంపిణీ చేయలేదని సుమారు 1100 వందల కుటుంబాలకు పైగా పట్టాలు పంపిణీ చేయకుండా వదిలేశారని అన్నారు.ఆపట్టాలు ఎప్పుడు పంపిణీ చేస్తారని ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా పట్టాల పంపిణీ చేయాలని కోరారు. ఇచ్చిన అటవీ పట్టాలకు వన్ బి అన్ లైన్ రావడం లేదు ఈ కారణంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని తక్షణం ఆన్ లైన్ వన్ బి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.బొర్ర పనుకు వలస జిల్లేడు వలస గ్రామాల గిరిజనులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. మండలంలో సారిక గంజాయి భద్ర డొంకల వెలగవలస జిల్లేడు వలస రెవెన్యూ పరిధిలో అన్సర్వేడు భూములు ఉన్నాయి తరతరాలుగా ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులు పేదలు సాగు చేస్తున్న నేటికీ సర్వేలు చేసి పట్టాలు ఇవ్వాలని కోరుతున్న సమస్య పరిష్కారం చేయడం లేదని తెలిపారు. ఇప్పటికే పేదలకు ఇచ్చిన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయని అన్యాక్రాంతం జరిగిన భూములను గుర్తించి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కురుకూటి కరాస వలస నెలిపర్తి తదితర గ్రామాల్లో దశాబ్దాలు తరబడి దళితులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విఆర్ఎస్ మిగిలి భూములను నిర్వాసితు గ్రామాలైన పందిరి మామిడి వలస కుద్దాడ వలస గ్రామాల గిరిజన పేద రైతులు సాగు చేసుకుంటున్న నేటికి ఎటువంటి హక్కులు లేకుండా ఉన్నారని వారందరికీ పట్టాలు సర్వేలు చేసి ఇవ్వాలని కోరారు.పై సమస్యలన్నీ ప్రభుత్వము జిల్లా ఉన్నతాధికారులు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కూనేటి చినబాబు పొట్టంగిరాము గెమ్మెల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (Story:భూ సమస్యలపై తాసిల్దార్ కి వినతిపత్రం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version