రైతు తలసరి ఆదాయంలో అగ్రస్థానమే చంద్రబాబు ఆశయం
రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేసిన జీవీ..
న్యూస్ తెలుగు / వినుకొండ : రైతుల తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రస్థానంలో ఉంచడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఆ లక్ష్యం చేరుకోవడానికే రాయితీపై యంత్ర పరికరాలు, సేంద్రియ సేద్యం వంటి నిధానాలతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంందన్నారు. వినుకొండ పట్టణం మార్కెట్ యార్డులో సోమవారం రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛీప్‌విప్ జీవీ మాట్లాడుతూ. డ్రోన్ల సాయంతో ఎరువులు వేయడం రైతులకు లాభ సాటిగా ఉందని, అందుకే 80% రాయితీతో వాటిని అందిస్తున్నామన్నారు. డ్రోన్ ఖరీదు రూ. 10 లక్షల ఖరీదు ఉంటే రూ.8లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నట్లు వెల్లడించారు. అందులో కేంద్రం 50శాతం భరిస్తోందన్నారు. వినుకొండలో రూ.50 లక్షల విలువైన పరికరాలు పంపి ణీ చేయడం సంతోషంగా ఉందంటూ సబ్సిడీ వ్యవసాయ పరికరాలు తీసుకుంటున్న రైతులకు అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు సంకల్పం మేరకు రాష్ట్రం మొత్తం రూ.417కోట్లతో వేలాదిమందికి సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు అందిస్తన్నామని, 2014-19 మధ్య కూడా 3లక్షల 20 మందికి రూ.1227కోట్లు ఖర్చు పెట్టి పరికరాలు పంపిణీ చేశామన్నారు. జగన్‌ప్రభుత్వంలో కేవలం రూ. 340 కోట్లే ఖర్చు చేసి ఆ లక్ష్యాన్ని కూడా నీరుగార్చారని వాపోయారు. కేంద్రం 60 శాతం ఇచ్చే చోట 40 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా 80వ్యవసాయ పథకాల్ని మూలపెట్టిన రైతుద్రోహి జగన్ అని మండిపడ్డారు. తెలుగుదేశం గత ప్రభుత్వంలో సూక్ష్మపోషకాలూ ఉచితంగా, 90% రాయితీతో డ్రిప్ సామాగ్రి ఇచ్చామన్నారు. భూసార పరీక్షలు పెద్దఎత్తున నిర్వహించి పంటసూ చనలు అందించామన్నారు. మధ్యలో జగన్ ఆపేసిన ఆ కార్యకమాలన్నీ ఇప్పుడు తిరిగి అంది స్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 3లక్షలమందికి పైగా రైతులకు భూసార పరీక్షలు చేసి పంట సూచనలు అందించినట్లు తెలిపారు. సేంద్రియ సాగుకు పెద్దఎత్తున ప్రోత్సాహం ఇస్తున్నామని, రైతులు కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించేలా ఈ రంగంలో ముందుకు వెళ్లాలని సూచించారు.. ఆరోగ్య కరమైన పంటలతో ప్రజలఆరోగ్యాలకు కూడా మేలు జరుగుతుందన్నారు. మంచిదిగుబడులు, ఆదాయం ఇచ్చే ఉద్యానపంటల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు, జనసేన నాయకులు నాగ శ్రీను రాయల్, లగడపాటి వెంకట్రావు, ముండ్ర సుబ్బారావు, మీసాల మురళీకృష్ణ, గోవింద నాయక్, బచ్చు అంజిరెడ్డి, పత్తి పూర్ణచంద్రరావు, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. (Story:రైతు తలసరి ఆదాయంలో అగ్రస్థానమే చంద్రబాబు ఆశయం)

