Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌స్టార్‌ హోటళ్లలో బార్‌ లైసెన్స్‌ ఫీజుల తగ్గింపుతో క‌స్ట‌మ‌ర్‌కు లాభ‌మేనా?

స్టార్‌ హోటళ్లలో బార్‌ లైసెన్స్‌ ఫీజుల తగ్గింపుతో క‌స్ట‌మ‌ర్‌కు లాభ‌మేనా?

స్టార్‌ హోటళ్లలో బార్‌ లైసెన్స్‌ ఫీజుల తగ్గింపుతో క‌స్ట‌మ‌ర్‌కు లాభ‌మేనా?

కూటమి ప్రభుత్వం ఉత్తర్వులతో గంద‌ర‌గోళం
రూ.60లక్షల నుంచిరూ.25లక్షలకు కుదింపు

న్యూస్‌ తెలుగు/అమరావతి: స్టార్‌ హోటళ్లలో నిర్వహించే బార్ల లైసెన్స్‌ ఫీజులు, నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ట్రేషన్ల ఛార్జీలను తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్రీ స్టార్‌తోపాటు పై స్థాయి హోటళ్లల్లో బార్ల లైసెన్సు, నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ట్రేషన్‌ ఛార్జీని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. లైసైన్సు ఫీజు, నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ట్రేషన్‌ ఛార్జీని రూ. 66 లక్షల నుంచి రూ.25లక్షల వరకు కుదిస్తూ నిర్ణయించింది. పర్యాటకంతోపాటు అతిథ్యరంగానికి ఊతమిచ్చేలా బార్ల లైసెన్స్సు ఫీజులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పర్యాటకంతోపాటు ఆతిథ్య రంగానికి ఊతమిచ్చేలా బార్ల రిజిస్ట్రేషన్‌ ఛార్జి, లైసెన్సు ఫీజులను తగ్గిస్త ఆదేశించింది.
ఏడాదికి లైసెన్సు ఫీజును రూ.5లక్షల మేర, నాన్‌ రిఫండబుల్‌ ఛార్జి రూ.20లక్షలకు నిర్దారిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏపీ టూరిజం డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెరిగేందుకు, రిసార్టులు, హోటళ్లకు ఈ నిర్ణయం ప్రోత్సాహం కల్పిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025 సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయి. స్థానిక జనాభాతో సంబంధం లేకుండానే స్టార్‌ హోటళ్లు ఉన్న చోట్ల ఈ లైసెన్సు ఫీజు ఛార్జీలు వర్తిస్తాయని ప్రభుత్వం తెలిపింది. తమిళనాడు, దిల్లీ, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో సమానంగా లైసెన్స్‌ ఫీజులను సవరిస్తూ ఆదేశాలిచ్చింది. అయితే ఈ స్టార్ హోట‌ళ్ల‌లో బార్ లైసెన్స్ ఫీజులు త‌గ్గించ‌డం వ‌ల్ల అక్క‌డ మ‌ద్యం సేవించే క‌స్ట‌మ‌ర్ల‌కు విధించే రేట్లు త‌గ్గుతాయా లేదా అన్న విష‌యంపై క్లారిటీ లేదు. ఈ విష‌యంపై ఒక స్టార్‌హోట‌ల్ య‌జ‌మానిని సంప్ర‌దించిన‌ప్పుడు ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. ఈ త‌గ్గింపు అనేది స్టార్ హోట‌ల్స్‌కు కొంత‌వ‌ర‌కు లాభ‌మేన‌ని, క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్రం దీని వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఒక బీరుకు 250 రూపాయ‌లు వ‌సూలు చేయ‌డం మొద‌లుపెట్టాక‌, ఆ రేటును త‌గ్గించినా క‌స్ట‌మ‌ర్‌కు లాభం క‌లిగేలా హోట‌ళ్లు రేట్లు త‌గ్గించ‌డం అసాధ్య‌మ‌ని చెప్పారు. (Story: స్టార్‌ హోటళ్లలో బార్‌ లైసెన్స్‌ ఫీజుల తగ్గింపుతో క‌స్ట‌మ‌ర్‌కు లాభ‌మేనా?)

Follow the Stories:

మెగా డీఎస్సీ పోస్టులు ఇవీ..!

ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!

టాప్‌ ప్రైవేట్‌ వర్సిటీల్లో ఇంజినీరింగ్‌ సీట్లు ఉచితం!

ఏపీ ఈఏపీసెట్‌-2025 Full Details

పర్యవేక్షణ నిల్‌..ఫలహారం పుల్‌!

జగన్‌ చుట్టూ కోటరీ ఎవరు?

Friday Fear: మ‌రో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు..!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!