Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌కుర్రాళ్ల‌ను కెలికేసి.. ఉచ్చులోకి లాగేసి!

కుర్రాళ్ల‌ను కెలికేసి.. ఉచ్చులోకి లాగేసి!

కుర్రాళ్ల‌ను కెలికేసి.. ఉచ్చులోకి లాగేసి!

డేటింగ్‌ యాప్స్‌..బీ అలర్ట్‌
ప్రేమతో యువతులకు గాలం
పెరుగుతున్న మోసాలు

న్యూస్ తెలుగు/అమరావతి: సామాజిక మాద్యమం విస్తృతంగా ప్రవేశించడంతో అది మేలుతోపాటు నష్టాన్ని చేరూర్చుతోంది. ప్రధానంగా యువత సామాజిక మాద్యంతోనే అధికంగా సమయం వెచ్చిస్తున్నారు. వాట్సాప్‌, ఇన్‌స్ట్రాగామ్‌, ఫేస్‌బుక్‌, వెబ్‌న్యూస్‌, ఎక్స్‌ ట్వీట్‌లు..ఇలా ఒకటేంటి..అనేకం ముందుకొచ్చేశాయి. వాటికి అనుబంధంగా వివిధ రంగాలకు చెందిన యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలలోనూ వారి కార్యకలాపాలకుగాను యాప్‌లు ప్రవేశపెడుతున్నారు. డేటింగ్‌ యాప్‌లు రంగంలోకి దిగాయి. వాటికి యువత అతిగా ఆకర్షితులవుతున్నారు. డేటింగ్‌ యాప్‌లోకి లాగిన్‌ అయి..ఒకర్నొకరు పరిచయం చేసుకుని నిట్టనిలువునా మోసపోతున్నారు. దేశంతోపాటు రాష్ట్రంలోనూ ఈ యాప్‌ల బారిన పడి యువతీయువ‌కులు అన్యాయానికి గురైన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయమైన యువతిని ఓ కేటుగాడు బురిడీ కొట్టించిన సంఘటనపై కేసు నమోదైంది. విజయవాడ ఏసీపీ దామోదర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగం నిమిత్తం విజయవాడ నగరానికి వచ్చింది. ఆమె హాస్టల్‌లో ఉంటోంది. ఈ యువతికి ఓ డేటింగ్‌ యాప్‌లో నాగతేజ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్యా మాటలు కలిసి, ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని పరిచయం చేసుకున్నారు. నెల రోజుల నుంచి రోజూ ఫోన్‌ మాట్లాడటం మొదలెట్టారు. ఈనెల 22వ తేదీన నాగతేజ..ఆ యువతిని ఓ హోటల్‌లో కలుద్దామని చెప్పి..ఇద్దరికీ హోటల్‌లో రూమ్‌ బుక్‌ చేశాడు. ఆమె హోటల్‌ రూమ్‌లోకి వచ్చిన అనంతరం అతడు కత్తి చూపించి ఆమెను బెదిరించాడు. ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, ఎట్టకేలకు నాగరాజును అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు, రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నాగతేజ వ్యసనాలకు బానిసై..డబ్బుల కోసం అమ్మాయిలను మోసగిస్తున్నట్లు పోలీసులకు వివరించారు. గతంలో అనేక మంది యువతులను నాగరాజు మోసగించినట్లు, ఇలాంటి డేటింగ్‌ యాప్‌ మోసాల పట్ల యువతీయువకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
డేటింగ్‌ యాప్‌లు..
ప్రస్తుతం దేశంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా డేటింగ్‌ యాప్‌లు చెలామణి అవుతున్నాయి. అసలు డేటింగ్‌ యాప్‌ అనేదీ మాట్లాడేందుకు ఉపయోగించినది. యూజర్ల పరంగా దేశంలో టిండర్‌ యాప్‌ ముందు వరుసలో ఉంది. ఆ తర్వాత హ్యాపెన్‌, బంబుల్‌, హింగే, ఓకే క్యూపిడ్‌, కాఫీ మీట్స్‌ బేగెల్‌, ట్రూలీ మ్యాడ్లీ, టన్‌టన్‌ యాప్‌లు ఉన్నాయి. ఒక్కసారిగా యూజర్‌ నేమ్‌ నమోదు చేసుకుని, మన వివరాలను పొందుపరచాలి. ఆ తర్వాత ఈ యాప్‌లను వినియోగించుకోవచ్చు. మనపై ఇష్టత చూపిన వారితో రిలేషన్‌ కొనసాగించేందుకు ఈ యాప్‌లు దోహదపడతాయి. ఈ యాప్‌ల ఆధారంగాను సైబర్‌ నేరాలు అధికమవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. యాప్‌లలో పరిచయమైన యువతీయువకులను నమ్మించి మోసగిస్తున్న సంఘటనలు వెలుగు చూడటంతో..వారంతా అప్రమత్తంగా ఉండాలి. కుర్రాళ్ల‌ను ప‌ద్ధ‌తి ప్ర‌కారం కెలికి, ఆ త‌ర్వాత వారిని ఉచ్చులోకి లాగుతున్నారు. (Story: కుర్రాళ్ల‌ను కెలికేసి.. ఉచ్చులోకి లాగేసి!)

Follow the Stories:

మెగా డీఎస్సీ పోస్టులు ఇవీ..!

ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!

టాప్‌ ప్రైవేట్‌ వర్సిటీల్లో ఇంజినీరింగ్‌ సీట్లు ఉచితం!

ఏపీ ఈఏపీసెట్‌-2025 Full Details

పర్యవేక్షణ నిల్‌..ఫలహారం పుల్‌!

జగన్‌ చుట్టూ కోటరీ ఎవరు?

Friday Fear: మ‌రో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!

రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు

కొత్త రేషన్‌ కార్డులొస్తున్నాయి!

సిటీ కిల్ల‌ర్ వ‌చ్చేస్తోంది! ముంబ‌యికి ముప్పు?

స‌డెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్‌!

నిరుద్యోగులకు మోదీ బంప‌ర్‌ ఆఫర్‌!

మారిన జ‌గ‌న్ వ్యూహ‌ర‌చ‌న: జగన్‌ 2.0 అంటే ఇదేనేమో!

మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?

మున్సిపల్‌ పీఠాలపై కూటమి గురి

బట్టలూడదీసి నిలబెడతా!: జగన్‌

జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)

వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
వణికిస్తున్న కొత్త వైర‌స్‌!
శుక్రవారం గండం! వైఎస్ఆర్సీపీలో అలజడి

దుర్గ‌గుడి ల‌డ్డూ ప్ర‌సాదంలో వెంట్రుక‌లు!

జైల్లో నా భర్తను.. టార్చర్‌ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments