వరి ధాన్యం కొనుగోలు వివరాలు నమోదు చేసుకోవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన వెంటనే వివరాలు రిజిస్టరు లో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
గురువారం కొత్తకోట మండలంని పాలెం వరి కొనుగోలు కేంద్రాన్నీ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో టెంట్, వడ్లు తూర్పు పట్టే ఫ్యాన్ లేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే టెంట్ వేయించాలని, తాలు తొలగించేందుకు ఫ్యాన్ పెట్టించి ఉపయోగించాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో వచ్చిన వడ్లు తేమ శాతం, నిర్వహిస్తున్న రిజిస్టర్లను పరిశీలించారు. సెంటర్ ఇంచార్జిని వచ్చిన వడ్లు సన్న రకమా లేక దొడ్డు రకమా అనేది శాస్త్రీయంగా ఎలా నిర్ధారిస్తావు క్యాలీపర్ మీటర్ ద్వారా చూపించమని అడిగారు. సెంటర్ ఇంచార్జి క్యాలీపర్ మిషన్ ఎలా ఉపయోగించాలి, అందులో ప్రామాణిక విలువలు ఏంటి అనేది చెప్పకపోవడంతో వెంటనే సెంటర్ ఇంచార్జిని మార్చాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి సెంటర్లో శిక్షణ పొందిన వారిని మాత్రమే సెంటర్ ఇంచార్జిగా నియమించాలని ఆదేశించారు. వడ్లలో తాలు, గడ్డి అధికంగా కనిపించడంతో పెడస్టల్ ఫ్యాన్, పాడి క్లీనర్ ద్వారా శుభ్రం చేసి కొనుగోలు చేయాలని సెంటర్ ఇంచార్జీలను ఆదేశించారు.
దొడ్డు రకం, సన్న రకం కొనుగోలు కేంద్రాలు వేరు వేరు గా నిర్వహించాలని, శిక్షణ పొందిన వారే సెంటర్ ఇంచార్జిగా ఉండాలని ఆదేశించారు. కొత్తకోట తహసీల్దార్ వెంకటేశ్వర్లు, రైతులు తదితరులు ఉన్నారు. (Story:వరి ధాన్యం కొనుగోలు వివరాలు నమోదు చేసుకోవాలి)