ఉగ్రదాడికి సిపిఐ నిరసన..
ఉగ్రవాదదిష్టిబొమ్మ దహనం
ఉక్కు పాదం మోపాలి : సిపిఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి :దేశంలోఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపాలని సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి, సిపిఐ నేత గోపాలకృష్ణ పిలుపునిచ్చారు. కాశ్మీర్ పహల్గామ్ వద్ద భారతీయులు పర్యాటకులు 27 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపడంపై సిపిఐ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణ అంబేద్కర్ చౌక్ లో ఉగ్రవాదం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఉగ్రవాదం నశించాలని,మతసామరస్యం విలసిల్లాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యాటకులపై ఉగ్రదాడి పిరికిపంద చర్య అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశంలో నక్సలైట్ల ను చంపించే పనిపై ఉన్న దృష్టి ఉగ్రవాదులను మట్టు పెట్టడంలో లేదన్నారు. మా దేహం ముక్కలైన దేశాన్ని ముక్కలు కానీయబోమశన్నారు. పార్టీలు ఎన్ని ఉన్నా దేశం శాంతి సామరస్యం కాపాడడంలో ఏకమవుతామన్నారు. 27 మందిని బలిగొన్న ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలని, ఇలాంటి ఘటనలు మళ్ళీ పురావృతం కాకుండా చూడాలన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సిపిఐ, ఎన్ యఫ్ ఐ డబ్ల్యూ, ఏఐఎస్ఎఫ్, ఏఐటీయూసీ నేతలు కళావతమ్మ, గోపాలకృష్ణ, ఎర్ర కుర్మయ్య, శిరీష, వెంకటమ్మ, జ్యోతి, చిన్న కుర్మయ్య, బాలరాజు రాముడు, నరేష్, వంశి, విజయ్, ప్రకాష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.(Story:ఉగ్రదాడికి సిపిఐ నిరసన..)