గల్లంతైన యువకుల కోసం
గాలింపు చర్యలు ముమ్మరం..
24 గంటలైనా తెలియని ఆచూకీ ఆందోళనలో బంధువులు

న్యూస్‌తెలుగు/ చింతూరు : మండలంలోని సీలేరు నది ప్రవాహంలో ఆదివారం గల్లంతైన ఇద్దరు యువకులు దిలీప్ శ్రీనివాసుల మృతదేహాల కోసం అధికారులు ఎన్టీఆర్ బృందం వారు సోమవారం వరకు గాలింపు చర్యలు ముమ్మరం గా చేపట్టారు. 24 గంటలు కావస్తున్న మృతదేహాల ఆచూకీ మాత్రం దొరకలేదు. కడసారి చూపు కోసం కన్నవారు బంధువులు స్నేహితులు ఘటన స్థలం వద్దనే ఎదురుచూస్తున్నారు. సబ్ కలెక్టర్ పిఓఐటిడిఏ అపూర్వ భారత్, తాసిల్దార్ చిరంజీవి, ఎస్సై రమేష్ విఆర్ఓ సిబ్బంది ఎప్పటికప్పుడు గాలింపు చర్యలను పరిశీలిస్తున్నారు. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జెకె సిటీ ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ బాధితుల కోసం భోజన సదుపాయాన్ని కల్పించి మండుటెండలో ఇబ్బందులు పడుతున్న బంధువులకు త్రాగునీరు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం సాయంత్రం వరకు జమాల్ ఖాన్ యువకుల మృతదేహాల కోసం అధికారులతో పాటుగా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. (Story:గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం..)

