చంద్రబాబు పుట్టినరోజు కానుక
మెగా డీఎస్సీ వచ్చేసిందోచ్..
16,347 పోస్టులతో నోటిఫికేషన్
జూన్ 6వ తేదీ నుంచి ఆన్‌లైన్ పరీక్షలు
దరఖాస్తులకు మే 15 డెడ్‌లైన్
మంత్రి నారా లోకేశ్ ట్వీట్‌లో వెల్లడి
న్యూస్ తెలుగు/అమరావతి: నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీకి (DSC) నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పుట్టిన రోజు సందర్భంగా ఈ శుభవార్తను నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) వెల్లడిరచారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలో భాగంగా ఆయన బాధ్యతలు స్వీకరించిననాడే తొలి సంతకం డీఎస్సీపై పెట్టారు. అనివార్య కారణాల వల్ల దానిని ఆ సమయంలో విడుదల కాలేకపోయింది. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో జిల్లా స్థాయి 14,088 ఖాళీలు, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలో 2,259 ఉపాధ్యాయ పోస్టులున్నాయి. జూన్ 6 నుంచి జులై 6 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు(సీబీటీ) నిర్వహిస్తారు. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, సహాయ కేంద్రాల వివరాలు, పరీక్షల సిలబస్ వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లలో…https://cse.ap.gov.in లేదా https://apdsc.ap.apcfss.in అందుబాటులో ఉంచారు. బధిర, అంధ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర, జోనల్ స్థాయిల్లో భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలకు జిల్లా స్థాయిలో భర్తీ చేస్తారు. అత్యధికంగా కర్నూలులో 1,817 ఎస్జీటీలు, అతి తక్కువుగా అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 106 ఉన్నాయి. ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వరకు ఆన్‌లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల ప్రక్రియ ఉంటుంది. అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక ‘కీ’ విడుదల చేస్తారు. ఏడు రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది ‘కీ’ విడుదల కానుంది. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితాను ప్రకటిస్తారు.
చారిత్రాత్మకంగా ముందడుగు: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
అంకిత భావం, అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం ద్వారా పాఠశాలలు, కమ్యూనిటీల సాధికారతలో ఇది ఒక చారిత్రాత్మక ముందడుగును సూచిస్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఓర్పు, పట్టుదలతో ఎదురుచూసిన ప్రతి ఔత్సాహికుడికి మీ క్షణం వచ్చేసింది. డీఎస్సీ షెడ్యూలును విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదిగా విడుదల చేశారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ కల సాకారం కానుంది. మేనిఫెస్టోలోని కీలక హామీని నెరవేరుస్తూ 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగాడీఎస్సీ నోటిఫికేషన్ నేడు ఉదయం 10 గంటలకు విడుదల కానుంది.
మెగా డీఎస్సీకి సంబంధించిన జిల్లా, రాష్ట్రస్థాయి పోస్టుల వివరాలిలా ఉన్నాయి.. (Story: చంద్రబాబు పుట్టినరోజు కానుక)
Follow the Stories:
ఇల్లు కట్టిచూడు..రాజధాని నిర్మించి చూడు!
టాప్ ప్రైవేట్ వర్సిటీల్లో ఇంజినీరింగ్ సీట్లు ఉచితం!
ఏపీ ఈఏపీసెట్-2025 Full Details
పర్యవేక్షణ నిల్..ఫలహారం పుల్!
జగన్ చుట్టూ కోటరీ ఎవరు?
Friday Fear: మరో వైసీపీ నేత అరెస్టుకు రంగం సిద్ధం!
రూ.520తో 10 లక్షలు, రూ. 755తో 15 లక్షలు
కొత్త రేషన్ కార్డులొస్తున్నాయి!
సిటీ కిల్లర్ వచ్చేస్తోంది! ముంబయికి ముప్పు?
సడెన్ డెత్: ఈ ఐఫోన్ మోడళ్లను నిలిపేసిన ఆపిల్!
నిరుద్యోగులకు మోదీ బంపర్ ఆఫర్!
మారిన జగన్ వ్యూహరచన: జగన్ 2.0 అంటే ఇదేనేమో!
మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
జగన్ సెల్ఫీ కోసం ఏడ్చిన చిన్నారి! (Lovely Photos)