రాష్ట్ర యాదవ సంఘం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నంబుల రాంబాబు యాదవ్
న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్ర యాదవ సంఘం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం చెందిన నంబుల రాంబాబు యాదవ్ ను నియమించినట్లు రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షులు కుర్ర శ్రీనివాస్ రావు యాదవ్ మంగళగిరిలోని యాదవ కేంద్ర కార్యాలయంలో ఓ ప్రకటనలో తెలిపారు. నంబుల రాంబాబు యాదవ్ ని రాష్ట్ర యాదవ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడంపై పల్నాడు జిల్లా యాదవ సోదర, సోదరీమణులు హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నంబుల రాంబాబు యాదవ్ మాట్లాడుతూ. యాదవ సమాజం అనేక రంగాల్లో వెనుకబాటు తనానికి గురవుతుందని, అన్ని వర్గాలతో పాటు అన్ని రంగాల్లో ముందు ఉండేలా కృషి చేస్తాను అని,తనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ యాదవ సమాజం కోసం పాటుపడతాను అని అన్నారు. (Story:రాష్ట్ర యాదవ సంఘం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నంబుల రాంబాబు యాదవ్)