మదమంచిపాడు తిరనాళ్లకు పగడ్బందీగా ఏర్పాట్లు
తిరునాళ్ల ఏర్పాట్లపై అధికారులతో చీఫ్ విప్ జీవీ సమీక్షా సమావేశం
న్యూస్ తెలుగు / వినుకొండ : మదమంచిపాడు వీరాంజనేయులు స్వామివారి తిరనాళ్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది, అసౌక ర్యానికి తావులేకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. అందుకోసం మంచినీళ్లు, శాంతిభద్రతల నుంచి తీర్థప్రసాదాల వరకు లోపాలకు తావులేకుండా చర్యలు ఉండాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న వినుకొండ మండలం మందమంచిపాడు శ్రీ వీరాంజనేయస్వామి తిరునాళ్లపై మంగళవారం వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ. తిరనాళ్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయడంలో అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భక్తుల సౌకర్యమే ప్రథమ ప్రాధాన్యమన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా తాగునీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎండ తీవ్రతకు గురికాకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మరీ ముఖ్యంగా పోలీస్, దేవాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడే ఉండి అన్నీ పర్యవేక్షిస్తారన్నారు. పంచాయతీరాజ్ సిబ్బంది పారిశుద్ధ్యం పనులు చూస్తారని… మొత్తం ఏర్పాట్లను తాహసీల్దార్ సమన్వయం చేస్తారన్నారు. ఎక్కడా సమన్వయం లోపం రాకూడదన్నీ ఈ సందర్భంగా అధికారులందరికీ ఆయన స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యార్థం వినుకొండ నుండి మదమంచిపాడు వీరాంజనేయ స్వామి ఆలయ వద్దకు ఆర్టీసీ బస్సులు 5 నడుపుతున్నట్లు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా టికెట్ ధర 20 రూపాయలుగా నిర్ణయించినట్లు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే మరిన్ని బస్సులు నడుపుతారని జీవి అన్నారు. తిరుణాలలో మూడు షిఫ్టుగా వైద్య సేవలు అందిస్తారని ఒక్కో షిఫ్ట్ కు డాక్టర్ తో సహా పదిమంది వైద్య సిబ్బంది ఉంటారని. ఆయన తెలిపారు అjలాగే ఆర్డబ్ల్యూఎస్ ద్వారా నాలుగు మంచినీళ్లు ట్యాంకర్లు ఏర్పాటుతోపాటు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే తిరుణాల్లో ఎటువంటి మద్యం విక్రయాలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. అలాగే తిరునాళ్లలలో ఎటువంటి అవంచానియా సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులతో సహా 200 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. భక్తులంతా ప్రశాంతంగా దర్శనం చేసుకుని స్వామి వారి ఆశీస్సులు పొందాలన్న లక్ష్యం గానే అంతా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సురేష్ నాయక్,దేవాదాయ శాఖ సుధాకర్ రెడ్డి, ఫైర్ స్టేషన్ నాగేశ్వరరావు, ఆర్టీసీ డిఎం నాగేశ్వరరావు, ఎస్. టి. ఐ ధనలక్ష్మి, సీఐ శోభన్ బాబు, తదితర అధికారులు పాల్గొన్నారు. (Story:మదమంచిపాడు తిరనాళ్లకు పగడ్బందీగా ఏర్పాట్లు)